రూ.6,999లకే షియామీ రెడ్ మీ 4ఏ స్మార్ట్ ఫోన్!

By: Madhavi Lagishetty

చైనా మొబైల్ దిగ్గజం షియోమీ తన రెడ్ మీ 4ఏ స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ను భారత్ లో ప్రకటించింది. 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజి కెపాసిటి కలిగిన రెడ్ మీ 4ఏ 6,999రూపాయలకు యూజర్లకు అందుబాటులో ఉంది.

రూ.6,999లకే షియామీ రెడ్ మీ 4ఏ స్మార్ట్ ఫోన్!

షియోమీ రెడ్ మీ 4ఏ ను ఈ ఏడాది మార్చిలో భారత్ లో లాంచ్ చేసింది. అప్పుడు ధర 5,999రూపాయలు అయితే...ఇది వన్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. చాలా కాలం పాటు 2జిబి ర్యామ్ మరియు 16జిబి స్టోరేజితో ఉంది.

రెడ్ మీ 4ఏ, 3జిబి ర్యామ్ మరియు 32జిబి ర్యామ్ తో ఆగస్టు 31నుంచి Mi.com, అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్, టాటాక్లిక్, పేటిఏం ద్వారా 6,999రూపాయలకు అందుబాటులో ఉంటుందని..షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ ట్వీట్ చేశారు.

ర్యామ్ మరియు స్టోరేజి కెపాసిటిలో ఎలాంటి డిఫరెన్స్ లేకుండా రెడ్ మీ 4ఏ స్పెసిఫికేషన్స్ వేరింయట్స్ ఒకేలా ఉంటాయి. రిఫ్రెష్ చేయడానికి రెడ్ మీ4ఏ పాలికార్బోనేట్ బాడీ మరియు హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్లో లాంచ్ చేయబడింది. MIUI 8, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆధారంగా రన్ అవుతుంది. 5అంగుళాల హెచ్ డి 720పిక్సెల్స్ డిస్ ప్లేను డివైస్ అమరిస్తుంది. 1.4గిగా క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 425SoC అడ్రినో 308 గ్రాఫిక్స్ యూనిట్ తో జత చేయబడింది.

జియో కౌన్ బనేగా క్రోర్ పతి, ఆడండి, గెలవండి

ఫ్రంట్ ఇమేజ్, షియోమీ రెడ్మి4ఏ, PDAF, f/2.2 ఎపర్చర్, LEDఫ్లాష్ మరియు 5పిక్సెల్స్ లెన్స్ తో వస్తుంది. 13మెగాపిక్సెల్ మెయిర్ కెమెరాతోపాటు 5మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్ కూడా ఉంటుంది. ఒక హైబ్రిడ్ సిమ్ స్లాట్, మైక్రోఎస్డి కార్డును 128జిబి వరకు విస్తరించవచ్చు.

కనెక్టివిటీ పరంగా, రెడ్ మీ 4ఏ 4జి వోల్ట్, వై-ఫై బ్లూటూత్ 4.1, GPS మరియు డ్యుయల్ సిమ్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ డివైస్ స్పీడ్ ఛార్జింగ్ కోసం 3120ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది.

షియోమీ ఇప్పటికే భారత్ లో రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా గుర్తింపు పొందింది. రెడ్ మీ నోట్ 4 మరియు రెడ్ మీ 4ఏ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో బెస్ట్ సెల్లర్ గా భావిస్తారు. రెడ్ మీ 4ఏ ఆప్ గ్రేడ్ చేయబడిన వేరియంట్ ప్రారంభాన్ని ఖచ్చితంగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రంగంలో విఘాతం కలిగించే చర్యగా చెప్పవచ్చు.

English summary
Xiaomi Redmi 4A with 3GB RAM and 32GB storage capacity has been launched in India at a price of Rs. 6,999.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot