4జీబి ర్యామ్ వేరియంట్‌తో Redmi 5

Posted By: BOMMU SIVANJANEYULU

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో అగ్రగామి బ్రాండ్‌గా దూసుకుపోతోన్న Xiaomi తన
రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌‍కు సంబంధించి సరికొత్త ర్యామ్ వేరియంట్‌ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. తాజా లాంచ్ నేపథ్యంలో రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌‍ 2జీబి, 3జీబీతో పాటు 4జీ ర్యామ్ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధర రూ.11,000..?

నూతనంగా లాంచ్ అయిన 4జీబి ర్యామ్ వేరియంట్ ధర CNY 1,099 (రూ.11,000)గా ఉంటుంది. 3జీబి ర్యామ్ వేరియంట్ తరహాలోనే 4జీబి ర్యామ్ వేరియంట్‌లో కూడా 32జీబి ఇన్‌బిల్ట్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది.

రెడ్‌మి 5 స్పెసిఫికేషన్స్...

5.7 అంగుళాల ఫుల్ హైడెఫిపిషన్ డిస్‌ప్లే, బీజిల్-లెస్ డిజైన్, ఎడ్జ్ టు ఎడ్జ్ స్ర్కీన్, 18:9 కాంట్రాస్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టాకోర్ 450 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రెడ్‌మి 5 ప్లస్ స్పెసిఫికేషన్స్..

Xiaomi తన రెడ్‌మి 5తో పాటు రెడ్‌మి 5 ప్లస్ వేరియంట్‌ను కూడా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ డివైస్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 5.9 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, బీజిల్-లెస్ డిజైన్, ఎడ్జ్ టు ఎడ్జ్ స్ర్కీన్, 18:9 కాంట్రాస్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 2.0GHz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టాకోర్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఆల్ ఇండియా రికార్డు సెట్ చేసిన దువ్వాడ జగన్నాధమ్

ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

ఇండియన్ మార్కెట్లో రెడ్‌మి 5, రెడ్‌మి 5 ప్లస్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. అనధికారికంగా తెలియవచ్చిన సమాచారం ప్రకారం ఈ రెండు ఫోన్‌లలో ఏదో ఒక మోడల్ మాత్రమే భారత్‌లో లభ్యమవుతుందని తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
xiaomi has announced a new 4GB RAM variant of the Redmi 5 in China. The 4GB RAM variant of the Redmi 5 joins the 2GB and 3GB RAM variants and is now available for buying in China at a price of CNY 1,099 (roughly Rs 11,000).
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot