కొత్త వేరియంట్‌లో Redmi 5A, నేటి నుంచే అమ్మకాలు

Posted By: BOMMU SIVANJANEYULU

Xiaomi బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన Redmi 5Aను, రోజ్ గోల్డ్ కలర్ వేరియంట్‌లో కూడా అందుబాటలో ఉంచుతున్నట్లు రెడ్‌మి ఇండియా తెలిపింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ ఫోన్ మార్కెట్లో లభ్యమవుతుందని తెలుస్తోంది. కొత్త వేరియంట్ కూడా యాడ్ అవటంతో Redmi 5Aను డార్క్ గ్రే, గోల్డ్ ఇంకా రోజ్ గోల్డ్ వేరియంట్‌లలో సొంతం చేసుకునే వీలుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దేశ్‌కా‌స్మార్ట్‌ఫోన్ నినాదంతో ముందుకు...

రెడ్‌మి 5ఏ ఇండియన్ మార్కెట్లో లంచ్ అయి దాదాపుగా రెండు నెలలు కావొస్తోంది.#DeshKaSmartphone అనే నినాదంతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ రూ.6000 ధర సెగ్మెంట్‌లో వన్‌ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా అవతరించింది.

2జీబి, 3జీబి వేరియంట్స్..

ర్యామ్ ఇంకా స్టోరేజ్ పరంగా ఈ ఫోన్ రెండు వెర్షన్‌లలో లభ్యమవుతోంది. 2జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.5,999. 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.6,999. రెడ్‌మి 4ఏకు సక్సెసర్ వర్షన్‌గా మార్కెట్లో లాంచ్ అయిన ఈ డివైస్ ను ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కు అనుగుణంగా డిజైన్ చేసినట్లు షావోమి ఇండియా తెలిపింది.

రెడ్‌మి 5ఏ (Redmi 5A) స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4GHz క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, అడ్రినో 308 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరే్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం

55 దేశాలను నమ్మించి నిలువు దోపిడి చేస్తున్న చైనా, గత 5ఏళ్ల నుంచి..!

కెమెరా స్పెసిఫికేషనన్స్..

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎఫ్ 2.2 అపెర్చుర్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ, 4జీ ఎల్టీఈ విత్ VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, మెటల్ బాడీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi will probably start selling the Rose Gold variant of its entry-level Redmi 5A phone in India from February 1.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot