నవంబర్ 30న రెడ్‌మి 5ఏ

By: BOMMU SIVANJANEYULU

సంచలన బ్రాండ్ షావోమి నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ కాబోతోంది. రెడ్‌మి 5ఏ (Redmi 5A) పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రొడక్ట్‌కు సంబంధించిన వివరాలను షావోమి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ తన అఫీషియట్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రివీల్ చేసారు. ముఖ్యంగా రూరల్ ఇండియాకు కనెక్ట్ అయ్యే విధంగా ఈ ప్రొడక్ట్ ఉంటుందని ఆయన తెలియజేసారు.

నవంబర్ 30న రెడ్‌మి 5ఏ

తాజాగా రెడ్‌మి ఇండియా, ఈ ఫోన్‌కు సంబంధించి అఫీషియల్ ట్వీట్‌ను పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ ప్రకారం నవంబర్ 30న ఈ ప్రొడక్ట్ అఫీషియల్‌గా లాంచ్ కాబోతోంది. #DeshKaSmartphone అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ఫోన్‌ను షావోమి ప్రమోట్ చేస్తోంది. రూ.6000 ప్రైస్ పాయింట్‌లో అందుబాటులో ఉండొచ్చని భావిస్తోన్న రెడ్‌మి 5ఏ ఇప్పటికే చైనా మార్కెట్లో లభ్యమవుతోంది. అక్కడి మార్కెట్లో ఈ డివైస్ ధర 599 Yuanలు (మన కరెన్సీలో ఈ విలువ షుమారుగా రూ.5,884).

రెడ్‌మి 5ఏ (Redmi 5A) స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 425 సాక్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్ కార్డ్స్ విత్ హైబ్రీడ్ సిమ్ స్లాట్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, మెటల్ బాడీ.

Airtel నెల రోజుల అన్‌లిమిటెడ్ ప్లాన్, తెలుగు రాష్ట్రాలకు మాత్రమే !

Read more about:
English summary
Xiaomi has not revealed which Redmi smartphone will be launched, but it is likely to be the Redmi 5A.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot