Xiaomi Redmi 9A:పవర్ ఫుల్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ తో షియోమీ కొత్త ఫోన్
చైనా స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థలు రియల్‌మి, రెడ్‌మిల మధ్య యుద్ధం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆ యుద్ధం మళ్ళి మొదలైంది. ఇండియాలో ఈ రోజు తన రియల్‌మి C3ని ప్రారంభించటానికి ఒక గంట ముందు షియోమి సంస్థ తన నుండి రాబోయే రెడ్‌మి 'దేశ్ కా దుమ్‌దార్ స్మార్ట్‌ఫోన్' రాకను ప్రకటించింది. బహుశా ఇది రెడ్‌మి 9A కావచ్చు.

కేవలం మూడు నెలల క్రితంమే షియోమి సంస్థ రెడ్‌మి 8A ను విడుదల చేసింది. కంపెనీ అప్పుడే దీనిని రెడ్‌మి 9A తో రిఫ్రెష్ చేస్తోంది. రెడ్‌మి 9A యొక్క లాంచ్ కంపెనీ ఇంకా ధృవీకరించలేదు కానీ అది ఉపయోగించిన ట్యాగ్‌లైన్ మరియు స్పెక్స్ రెడ్‌మి 8A యొక్క అప్ డేట్ వెర్షన్ ను ఎత్తి చూపుతున్నాయి. ఒక సంవత్సరంలోపు వస్తున్న మూడవ రెడ్‌మిA సిరీస్ ఫోన్ ఇది. రెడ్‌మి 9A ఫిబ్రవరి 11 న కొత్త రెడ్‌మి ప్రొడక్ట్ కేటగిరీతో పాటు లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 11 న షియోమి రెడ్‌మి 9A లాంచ్
షియోమి Mi.com లో ఈవెంట్ పేజీని సృష్టించింది. ఇందులో తన నుంచి రాబోయే రెడ్‌మి 9A యొక్క కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ లను వెల్లడించింది. ఇప్పటి వరకు వచ్చిన రెడ్‌మి A-సిరీస్ ఫోన్‌లలో వెనుకవైపు కేవలం ఒకే ఒక కెమెరాను కలిగి ఉన్నాయి. అయితే రెడ్‌మి 9A యొక్క హైలైట్ విషయం ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉండడం. సెకండరీ డెప్త్ సెన్సార్ ఖచ్చితమైన పోర్ట్రెయిట్ల కోసం ‘డుమ్దార్ కెమెరా' ను అందిస్తుందని షియోమి తెలిపింది. రెడ్‌మి 9A లోని మెయిన్ కెమెరా సంస్థ ఇప్పటికే అందిస్తున్న 12MP సోనీ IMX363 సెన్సార్ ఉండవచ్చు.

రెడ్‌మి 8A మాదిరిగానే రెడ్‌మి 9A కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు ఇన్-హ్యాండ్ ఫీల్ మరియు గ్రిప్ కోసం ఆరా వేవ్ డిజైన్‌ను కూడా కలిగి ఉంది. రెడ్‌మి 8A తో పోలిస్తే షియోమి రెడ్‌మి 9A వివిధ రకాల కలర్ వేరియంట్‌లను విడుదల చేయవచ్చు.

షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ ట్విట్టర్లో తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 11న కంపెనీ వినియోగదారులకు రెండు ఆశ్చర్యకరమైన ప్రొడక్టులను లాంచ్ చేయనున్నది. వాటిలో ఒకటి రెడ్‌మి పవర్ బ్యాంక్ మరియు రెండవది రెడ్‌మి 9A కావచ్చు. Mi.comలోని వెబ్ పేజీలో ఈవెంట్ యొక్క కొత్త కేటగిరీ లాంచ్ గురించి కౌంట్ డౌన్ సమయం చూపిస్తుంది.

రియల్‌మి C3 స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు
ఇండియాలో రియల్‌మి C3 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. ఇందులో 3GB RAM + 32GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.6,999 మరియు 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.7,999 లుగా ఉంది. దీని యొక్క మొదటి సేల్ వాలెంటైన్స్ డే సందర్బంగా ఫిబ్రవరి 14 నుండి మొదలు కానున్నాయి.

రియల్‌మి C3 స్పెసిఫికేషన్స్
రియల్‌మి C3 స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల HD+ డిస్ప్లే, రెండు సిమ్ కార్డులు మరియు ఒక SD కార్డు కోసం ట్రిపుల్ కార్డ్ స్లాట్‌కు మద్దతును అందిస్తుంది. SD కార్డ్ స్లాట్ ద్వారా వినియోగదారులు మెమొరీని 256GB వరకు విస్తరించడానికి అవకాశం ఉంది. ఈ ఫోన్ యొక్క వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ కెమెరా సెటప్‌లో మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్ సెన్సార్ తో వస్తుంది. అలాగే పోర్ట్రెయిట్‌ల మోడ్ కోసం 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ఇది HDR, నైట్‌స్కేప్, క్రోమా బూస్ట్ మరియు స్లో-మోషన్ కు కూడా మద్దతునిస్తుంది. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అమర్చబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications