షియోమి ఫోన్లలో ఇదే అత్యంత తక్కువ ధరలో లభించే ఫోన్

చైనీస్ మొబైల్ మేకర్ షియోమి నుంచి వస్తున్న తొలి ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు భారత్‌లో విడుదలఅయింది.ఇందులో ఆండ్రాయిడ్ గో ఎడిష‌న్ ఓఎస్‌ను అందిస్తున్నారు. కాగా ఈ ఓఎస్ క‌లిగిన మొద‌టి షియోమీ ఫోన్ ఇ

|

చైనీస్ మొబైల్ మేకర్ షియోమి నుంచి వస్తున్న తొలి ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు భారత్‌లో విడుదలఅయింది.ఇందులో ఆండ్రాయిడ్ గో ఎడిష‌న్ ఓఎస్‌ను అందిస్తున్నారు. కాగా ఈ ఓఎస్ క‌లిగిన మొద‌టి షియోమీ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇక ఈ ఫోన్ రూ.4499 ధ‌ర‌కే వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఈ నెల 22వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోమ్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్ర‌యంచ‌నున్నారు.

షియోమి ఫోన్లలో ఇదే అత్యంత తక్కువ ధరలో లభించే ఫోన్

ప్రస్తుతం షియోమీ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ అయిన రెడ్‌మీ 6ఎ ధర రూ.5,999గా ఉంది. Xiaomi Redmi Go ఫోన్ దీని కన్నా తక్కువకే రూ.4999కే లభిస్తోంది.

తొలి గూగుల్ ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్

తొలి గూగుల్ ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్

రెడ్‌మి గో స్మార్ట్‌‌ఫోన్ ఇప్పటికే ఇతర మార్కెట్లలో అందుబాటులో ఉంది. షియోమి నుంచి వస్తున్న తొలి గూగుల్ ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి గో అని చెప్పవచ్చు. మ్యాప్స్ గో, యూట్యూబ్ గో వంటి యాప్స్ ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. వివిధ రంగుల్లో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి.

రెడ్‌మీ గో స్పెసిఫికేషన్:

రెడ్‌మీ గో స్పెసిఫికేషన్:

డ్యూయల్ సిమ్ (నానో), 5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 425 ఎస్ఓసీ, 1జీబీ ర్యామ్/8జీబీ స్టోరేజీ, 1జీబీ ర్యామ్/16 జీబీ స్టోరేజీ వేరియంట్లు ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

 

జియో ఆఫర్

జియో ఆఫర్

లాంచింగ్‌ ఆఫర్‌ విషయానికి వస్తే జియో రీ చార్జ్‌ ద్వారా రూ. 2200 క్యాష్‌బ్యాక్‌, 100 జీబీ ఉచిత ఆఫర్‌ను అందిస్తోంది.ఈ నెల 22వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోమ్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్ర‌యంచ‌నున్నారు

మి పేమెంట్స్‌ యాప్‌

మి పేమెంట్స్‌ యాప్‌

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ఆధారిత చెల్లింపులకు సంబంధించి 'మి' పేమెంట్స్‌ యాప్‌ను కూడా షియోమి ఆవిష్కరించింది. పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఐసీఐసీఐ బ్యాంకు వ్యవహరిస్తుందని తెలిపింది. కేవలం యూపీఐకి మాత్రమే పరిమితం కాకుండా డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కూడా చెల్లింపులు జరిపేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుంది.

తమిళనాడులో మరో ప్లాంటు

తమిళనాడులో మరో ప్లాంటు

త్వరలోనే ‘మి' యాప్‌స్టోర్‌లో అందుబాటులోకి వస్తుందని షియోమీ తెలిపింది. షియోమీ అటు తమిళనాడులో మరో ప్లాంటును ప్రారంభించింది. దీంతో భారత్‌లో తమ ప్లాంట్ల సంఖ్య 7కు చేరినట్లు కంపెనీ పేర్కొంది. ఫాక్స్‌కాన్, ఫ్లెక్స్, హైప్యాడ్‌ సంస్థల భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేసినట్లు వివరించింది.

Best Mobiles in India

English summary
xiaomi redmi go with 8 megapixel rear camera snapdragon 425 soc to launched in india

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X