Xiaomi నుంచి షాకింగ్ న్యూస్!! రెడ్‌మి నోట్ 10 ధరలు పెరిగాయి...
షియోమి స్మార్ట్‌ఫోన్ సంస్థ ఇటీవల భారతదేశంలో బడ్జెట్ ధరలో రెడ్‌మి నోట్ 10, నోట్ 10 ప్రో, మరియు నోట్ 10 ప్రో మాక్స్ వంటి మూడు ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ మూడు ఫోన్‌లలో వనిల్లా మోడల్ ప్రారంభమైన ఒక నెల తర్వాత నిశ్శబ్దంగా ధరల పెరుగుదలను అందుకుంది. ఈ కొత్త ధరలు ఇప్పుడు కంపెనీ యొక్క వెబ్‌సైట్‌లో మరియు అమెజాన్ ఇండియాలో కూడా చూపుతున్నాయి. ఈ క్రొత్త ధరలు మరియు ఇతర వివరాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి నోట్ 10 కొత్త ధరల వివరాలు
షియోమి రెడ్‌మి నోట్ 10 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర మీద ఇప్పుడు భారతదేశంలో రూ.500 పెరుగుదలను అందుకున్నది. ఈ ఫోన్ యొక్క అన్ని ర్యామ్ / స్టోరేజ్ వేరియంట్‌లకు ఇది వర్తిస్తుంది. కొత్త ధరల విషయానికి వస్తే 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ మోడల్ ఇప్పుడు రూ.12,499 ధర వద్ద లభిస్తుండగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.14,499 ధర వద్ద లభిస్తుంది. అంతకుముందు ఈ ఫోన్ యొక్క బేస్ వేరియంట్ యొక్క ధర 11,999 రూపాయలు కాగా 128GB మోడల్ ధర 13,999 రూపాయలు.

రెడ్‌మి నోట్ 10 స్పెసిఫికేషన్స్
రెడ్‌మి నోట్ 10 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12 పై తో రన్ అవుతువుంది. ఇది HDR-10 మద్దతు మరియు TÜV రీన్‌ల్యాండ్ తో 6.67-అంగుళాల ఫుల్-HD + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది బ్లూ లైట్ సర్టిఫికేషన్ తో వస్తుంది. అలాగే ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 జి SoC చేత శక్తినిస్తుంది. దీనితో పాటు అడ్రినో 618 జిపియు మరియు 6GB వరకు LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో గల క్వాడ్ రియర్ కెమెరా సెటప్ లో 48 మెగాపిక్సెల్ ప్రాధమిక శామ్‌సంగ్ ISOCELL GW3 సెన్సార్‌తో పాటు 5 మెగాపిక్సెల్ సూపర్ మాక్రో షూటర్‌తో పాటు 2x జూమ్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్- యాంగిల్ షూటర్ మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ కూడా ఉంది.

రెడ్‌మి నోట్ 10 ఫీచర్స్
రెడ్‌మి నోట్ 10 యొక్క స్టోరేజ్ మరియు ఇతర ఫీచర్ల విషయానికొస్తే ఇది 128GB వరకు UFS 2.2 స్టోరేజ్ ను కలిగి ఉంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ ప్రత్యేకమైన స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఇన్‌ఫ్రారెడ్, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అలాగే ఇది 360-డిగ్రీల యాంబియంట్ లైట్ సెన్సార్ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications