అన్ని ‘బిగ్ బజార్’లలో Redmi Note 4, Redmi 4 విక్రయాలు
పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ Xiaomi దేశవ్యాప్తంగా బిగ్ బజార్ స్టోర్‌లను నిర్వహిస్తోన్న Future Groupతో చేతులు కలిపింది.
పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ Xiaomi దేశవ్యాప్తంగా బిగ్ బజార్ స్టోర్‌లను నిర్వహిస్తోన్న Future Groupతో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా షావోమీ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లైన Redmi Note 4, Redmi 4లను అన్ని బిగ్ బజార్ స్టోర్‌లలో కొద్ది రోజుల పాటు విక్రయిస్తారు. వీటితో పాటు మరిన్ని mi ఫోన్‌లను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచుతారు.

దీపావళి పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న 240కి పైగా బిగ్ బజార్ స్టోర్‌లలో రెడ్‌మి నోట్ 4 అలానే రెడ్‌మి 4 ఫోన్‌లను అందుబాటులో ఉంచుతున్నట్లు షావోమీ
ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనుకుమార్ జెయిన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.
బిగ్ బజార్ స్టోర్‌లలో షియోమీ ఫోన్‌లను కొనుగోలు చేసే ఐసీఐసీఐ బ్యాంక్ ఖతాదారులకు no cost EMI సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఇటీవల Flipkart, Amazonలు నిర్వహించిన ఆన్‌లైన్ సేల్స్‌లోనూ Redmi ఫోన్‌ల హవా కొనసాగినట్లు తెలుస్తోంది. గతవారం జరిగిన ఆన్‌లైన్ ఫెస్టివ్ సేల్స్‌లో భాగంగా కేవలం రెండు రోజుల్లో 10 లక్షల ఫోన్‌లను విక్రయించినట్లు Xiaomi వెల్లడించింది.
ఇటు ఆన్‌లైన్ మార్కెట్‌తో పాటు ఆఫ్‌లైన్ మార్కెట్‌ను కూడా కీలకంగా భావించిన షావోమీ.. క్రోమా, విజయా సేల్స్, సంగీతా వంటి రిటైల్ చెయిన్‌లతో కూడా చేతులు కలిపింది. ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా 1500కు పైగా రిటైల్ స్టోర్‌లలోకి తమ ప్రొడక్ట్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. చిన్నచిన్న స్టోర్‌లలో కూడా తమ ఉత్పత్తులను అందుబాటులో ఉండేలా చూడాలన్నది Xiaomi లక్ష్యంగా తెలుస్తోంది.
Xiaomi బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన రెడ్‌మి నోట్ 4 స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, 4100 mAh బ్యాటరీ, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.
ఈ ఫోన్ మొత్తం మూడు ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. వాటి వివరాలతో పాటు ధరలు.. 2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ (ధర రూ.9,999). 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ (ధర రూ.10,999). 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ (ధర రూ.12,999).
Xiaomi బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో మరొకటైన Redmi 4 స్పెసిఫికేషన్స్...
5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ నౌగట్ ప్రివ్యూ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4100mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్ 4జీ సపోర్ట్.
ఈ ఫోన్ మొత్తం మూడు రకాల ర్యామ్ అలానే స్టోరేజ్ వేరియంట్‌లలో లభ్యమవుతుంది. వాటి వివరాలతో పాటు ధరలు.. 2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ (ధర రూ.6,999). 3జీబి ర్యామ్ +
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ (ధర రూ.8,999). 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ (ధర రూ.10,999).


Click it and Unblock the Notifications








