రెడ్‌మై నోట్ 4జీ బుకింగ్‌లను ప్రారంభించిన ఎయిర్‌టెల్
ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ ఎయిర్‌టెల్ తన సొంత పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో కూడిన షియోమీ రెడ్‌మై నోట్ 4జీ ఫోన్‌లకు సంబంధించి ఎంపిక చేసిన నగరాల్లో ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.9,999గా ఎయిర్ టెల్ నిర్ణయించింది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
ఇంతకు ముందు వరకు రెడ్‌మై నోట్ 4జీ ఫోన్‌లను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించేది. బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబయ్, ఢిల్లీ - ఎన్‌సీఆర్, కోల్‌కతా నగరాల్లోని 133 ఎయిర్‌టెల్ స్టోర్‌లలో ఈ ఫోన్‌లను పొందవచ్చు. ఈ బుకింగ్ ప్రక్రియను ఇప్పటికే ఎయిర్‌టెల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘మై పేజ్'లో ప్రారంభించింది. వినియోగదారులు క్రెడిడ్ కార్డ్, డిబెట్ కార్డ్ లేదా క్యాష్ పేమెంట్ విధానం ద్వారా ఆన్ లైన్ లో ఈ ఫోన్ ను బుక్ చేసుకోవచ్చని ఎయిర్ టెల్ తెలిపింది.
షియోమీ రైడ్‌మై నోట్ 4జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు 5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఎమ్ఐయూఐ 5 ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆధారం).


Click it and Unblock the Notifications








