షాకిస్తోన్న Redmi Note 5 స్పెసిఫికేషన్స్!

By: BOMMU SIVANJANEYULU

Xiaomi Redmi సిరీస్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన RedMi Note 3, RedMi Note 4 స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఎంతటి పాపులారిటీని సొంతం చేసుకున్నాయో మనందరికి తెలుసు. తాజాగా తన నోట్ సిరీస్ నుంచి Redmi Note 5ను కూడా షావోమి రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. 18:9 కారక నిష్పత్తితో రాబోతోన్న ఈ ఫుల్ విజన్ డిస్‌ప్లే ఫోన్‌కు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ మరో ప్రధానమైన హైలైట్‌గా నిలవనుందట.

షాకిస్తోన్న Redmi Note 5 స్పెసిఫికేషన్స్!

ఈ ఫోన్‌లో Snapdragon 660 లేదా MediaTek Helio P25 SoCలను వినియోగించి ఉండొచ్చని తెలుస్తోంది. 4000mAh బ్యాటరీ కెపాసిటీతో రాబోతోన్న ఈ ఫోన్ బ్యాకప్ విషయంలోనూ పూర్తి భరోసాగా నిలవనుందట.

4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్ 5.0, క్విక్ ఛార్జ్ 4.0, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి లేటెస్ట్ కనక్టువిటీ ఫీచర్లతో రాబోతోన్న . Redmi Note 5 టాప్-ఎండ్ వేరియంట్ ధర మార్కట్లో రూ.13,000 వరకు ఉండొచ్చని సమాచారం.

రెడ్‌మి నోట్ 3, రెడ్‌మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌లు భారీ విజయాలను నమోదు చేసిన నేపధ్యంలో, ఈ సిరీస్‌కు కొనసాగింపుగా రాబోతోన్న Redmi Note 5 పై ఇప్పటికే మార్కెట్లో భారీ అంచనాలు నెలకున్నాయి.

ఇటు రెడ్‌మి నోట్ 5తో పాటు Redmi 5కు సంబంధించిన సమాచారం కూడా ఇంటర్నట్ లో హల్ చల్ చేస్తోంది. ప్రముఖ మొబైల్ గీక్ Roland Quandt తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రివీల్ చేసిన వివరాల ప్రకారం రెడ్‌మి 5 రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుందట.

అందులో ఒకటి 16జీబి వేరియంట్ కాగా, మరొకటి 32జీబి వేరియంట్. మరొక మోడల్ అయిన Redmi 5 Plus కూడా రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవుతుందట. అందులో ఒకటి 32 1జీబి వేరియంట్ కాగా, మరొకటి 64జీబి వేరియంట్.

కొద్ది రోజుల క్రితమే Redmi Note 5A ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసిన షావోమి తాజాగా తాజగా Redmi 5Aను అందుబాటులోకి తీసుకువచ్చేసింది. MIUI 9 యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ మిస్ అయ్యింది.

షాకిస్తోన్న Redmi Note 5 స్పెసిఫికేషన్స్!


Redmi 5A స్పెసిఫికేషన్స్...

5-ఇంచ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280 పిక్సల్స్) విత్ 296 పీపీఐ, లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేయబడిన MIUI 9 యూజర్ ఇంటర్‌ఫేస్‌, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్-కోర్ 425 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : f/2.2 అపెర్చుర్, బరస్ట్ మోడ్, పానోరమా మోడ్, హెచ్‌డి‌ఆర్ మోడ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, 3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, బ్లుటూత్, వై-ఫై, మైక్రో యూఎస్బీ.

English summary
Xiaomi Redmi Note 5, Redmi 5 Details Leaked; Launch Expected Soon. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot