రెడ్‌మి నోట్ 7 ప్రొ కొనడానికి 5 కారణాలు
దేశీయ మొబైల్ మార్కెట్లో కెమెరాల శకం ప్రారంభమైంది. అత్యధిక మెగా ఫిక్సల్ కలిగిన కెమెరాల వైపు యూజర్లు ఆసక్తిచూపుతుండటంతో దిగ్గజాలు వారి ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్త
దేశీయ మొబైల్ మార్కెట్లో కెమెరాల శకం ప్రారంభమైంది. అత్యధిక మెగా ఫిక్సల్ కలిగిన కెమెరాల వైపు యూజర్లు ఆసక్తిచూపుతుండటంతో దిగ్గజాలు వారి ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగానే చైనా మొబైల్ మేకర్ షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 7 ప్రొ ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 6.3 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్‌లను అమర్చారు.

4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ కొనేందుకు 5 కారణాలను విశ్లేషిస్తే..

రెడ్‌మీ నోట్ 7 ప్రొ ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.

48 ఎంపి కెమెరా
వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ కలిగిన కెమెరాను అమర్చారు. ముందు భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరా ఉంది. దీనికి ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందిస్తున్నారు. డిస్‌ప్లే కు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ల్యాపీకి సమానంగా ఇందులో కెమెరా ఫీచర్ ఉంది. రిజల్యూషన్ ఫోటోలు తీసినప్పుడు దాని స్పేస్ కూడా తక్కువగా తీసుకుంటుంది. 48 ఎంపి ఫోటోలకు 15-19MB సైజులోనూ అలాగే 12 ఎంపి కెమెరాకు 6-8MB సైజులోనూ వస్తాయి.

నైట్ మోడ్
లో వెలుతురులోనూ ఫోటోలు తీసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఫోన్ కెమెరాలో నైట్ మోడ్ ఫీచర్ ని ప్రవేశపెట్టారు. కాగా ఈ ఫీచర్ OnePlus 6 లోనూ ఉంది. అయితే దాని కన్నా బెటర్ గా ఫీచర్ ను అందిస్తున్నారు.

MIUI 10
ఈ ఫోన్ షియోమి లేటెస్ట్ ఆఫరేటింగ్ సిస్టం MIUI 10 మీద రన్ అవుతుంది. దీని ద్వారా పుల్ స్క్రీన్ అలాగే అలాగే కొత్తగా నోటీఫికేషన్ ఫీచర్లు కనిపిస్తాయి. ధర్డ్ పార్టీ అప్లికేషన్లను కూడా ఆప్టిమైజ్ చేస్తుంది.

వాటర్ రిసిస్టెంట్
కాగా ఫోన్ ఎటువంటి ఐపీ సర్టిఫికేషన్ తో రాలేదు. కాకుంటే P2i nano coatinను పొందుపరిచారు. దీని ద్వారా ఫోన్ ప్రొటక్షన్ చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది.

ధర
రెడ్‌మీ నోట్ 7 ప్రొ స్మార్ట్‌ఫోన్ నెప్ట్యూన్ బ్లూ, నెబ్యులా రెడ్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.13,999 ధరకు, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.16,999 ధరకు లభ్యం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్ సైట్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్లను మార్చి 13వ తేదీ నుంచి విక్రయిస్తారు.


Click it and Unblock the Notifications








