Xiaomi Republic Day sale, భారీ ఆఫర్లకు తెర !
ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు షియోమి కూడా భారీ ఆఫర్లకు తెరలేపింది.
ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు షియోమి కూడా భారీ ఆఫర్లకు తెరలేపింది. రేపటి నుంచి రిపబ్లిక్ డే సేల్ ఎంఐ.కామ్‌లో నిర్వహించబోతోంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్లు, ఆడియో యాక్ససరీస్, పవర్ బ్యాంక్స్, హోమ్ గాడ్జెట్స్, ఇతర ఉత్పత్తులపై షియోమి ప్రకటించింది. కాగా రేపు అర్థరాత్రి నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్, రిపబ్లిక్ డే వరకు కొనసాగనుంది.

డిస్కౌంట్ కూపన్లు
ఈ సేల్ పిరియడ్‌లో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు డిస్కౌంట్ కూపన్లను కంపెనీ అందించనుంది.రూ.50, రూ.100, రూ.200, రూ.500 డినామినేషన్లలో ఈ డిస్కౌంట్ కూపన్లు అందుబాటులో ఉండనున్నాయి.

మొబిక్విక్ ద్వారా
మొబిక్విక్ ద్వారా జరిపిన పేమెంట్లకు ఫ్లాట్ 30 శాతం అదనంగా సూపర్ క్యాష్‌ను అందించనుంది. దీంతో పాటు మూడు నెలల హంగామా ప్లే సబ్‌స్క్రిప్షన్‌ను, 12 నెలలు హంగామా మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ ఈ సేల్‌లో కొనుగోలుదారులకు లభించనుంది.

డిస్కౌంట్ పొందే ఫోన్ వివరాలు అంచనా..
రూ. 14,999 విలువ గల ఎంఐ ఏ1 స్మార్ట్‌ఫోన్ రూ. 13,999కే లభ్యం కానుంది.
ఎంఐ మిక్స్2 ధర రూ.35,999 నుంచి 32,999 రూపాయలకు తగ్గించింది.
ఎంఐ మ్యాక్స్2 ధరను కూడా వెయ్యి రూపాయల మేర తగ్గించింది.

రెడ్‌మి 5ఏ
ఈ సేల్‌లో కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 5ఏ కూడా రూ.4999 నుంచి విక్రయానికి రానుంది.
రెడ్‌మి వై1 ప్రారంభ ధర 8,999 రూపాయలు కాగ, రెడ్‌మి వై1 లైట్ 6,999 రూపాయల నుంచి అందుబాటులో ఉండనుంది.

ఎంఐ పవర్ బ్యాంకు 2
20000 ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంకు 2ఐ రూ.1499కు, 10000 ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంకు 2ఐ రూ.799కు, ఎంఐ బ్యాండ్-హెచ్‌ఆర్‌ఎక్స్ ఎడిషన్ రూ.1299కు షియోమి అందుబాటులో ఉంచనుంది.

200 రూపాయల వరకు డిస్కౌంట్
పలు స్మార్ట్‌ఫోన్ కేసులు, కవర్లపై 200 రూపాయల వరకు డిస్కౌంట్‌ను అందించనున్నట్టు ప్రకటించింది.


Click it and Unblock the Notifications








