షియోమీ యాప్ వాల్ట్ లో సరికొత్త టుడేస్ డీల్స్ కార్డ్ లభ్యం..

Posted By: M KRISHNA ADITHYA

టెక్నాలజీ జెయింట్ షియోమీ గత నెలలోనే గూగుల్ ప్లేస్టోర్ లో యాప్ వాల్ట్ ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ వాల్ట్ అనేది షియోమీ ఎమ్ఐయూఐ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌లోని పలు యుటిలిటీ యాప్స్‌ను ఒక క్రమపద్ధతిలో అమర్చుకొనే వీలు కల్పించింది. ఇప్పుడు తాజాగా షియోమీ వాల్ట్ లో మరో సరికొత్త అప్‌డేట్ వచ్చింది. ఇందులో "టుడేస్ డీల్స్" పేరిట కార్డ్ ను జత చేసింది. టుడేస్ డీల్స్ కార్డ్‌ వల్ల యూజర్స్ పలు ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ఇందులో ఒకే ప్లాట్‌ఫామ్ పై షాపింగ్ చేసే వీలు కలిగింది. ఇందులో పలు డీల్స్ కూడా పొందుపరుస్తారు. యూజర్స్ కేవలం షియోమీ యాప్ వాల్ట్‌ను ఇన్ స్టాల్ చేసుకొని అందులో టుడేస్ కార్డ్ ను యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్క సారి యాడ్ చేసుకున్న అనంతరం పలు డీల్స్ కనిపిస్తాయి. అంతే కాదు టుడేస్ డీల్స్ తో పాటు స్టాక్స్‌కార్డ్ పేరిట మరో ఆప్షన్ కూడా కనిపిస్తుంది. స్టాక్స్‌కార్డ్ ద్వారా స్టాక్ ధరలను తెలుసుకునే వీలుంది.

షియోమీ యాప్ వాల్ట్ లో సరికొత్త టుడేస్ డీల్స్ కార్డ్ లభ్యం..

టుడేస్ డీల్స్ కార్డ్ పొందే విధానం
1. హోమ్ స్క్రీన్ ను కుడి వైపు స్వైప్ చేయడం ద్వారా యాప్ వాల్ట్ లోకి ప్రవేశించవచ్చు.
2. కస్టమైజ్ ను క్లిక్ చేయడం ద్వారా మీకు నచ్చిన కార్డును యాడ్ చేసుకోవచ్చు.
టుడేస్ డీల్స్ కార్డ్ ద్వారా పలు డీల్స్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ రూపంలో వస్తుంటాయి. అంతేకాదు యాప్ వాల్ట్ లో మరిన్ని యాప్స్ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటం విశేషం. మరోవైపు షియోమీ ప్రస్తుతం భారత్ లో మూడు కొత్త యూనిట్లను సైతం ప్రారంభించనుంది. అందులో భాగంగా తొలిసారిగా సర్‌ఫేస్ మౌంట్ టెక్నాలజీ ప్లాంట్‌ను షియోమీ ప్రారంభించనుంది. అలాగే ప్రింటెట్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ యూనిట్లను సైతం తమిళనాడులోని శ్రీ పెరుంబుదూరులో ప్రారంభించనున్నట్లు షియోమీ ఇటీవల నిర్వహించిన సదస్సులో ప్రకటించింది. ఈ నూతన ప్లాంట్లను ఫాక్స్ కాన్ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నారు.

ఇకపై ఫేస్‌బుక్‌లో ఇవి చేయడం కష్టం, జుకర్‌బర్గ్ కీలకమైన చర్యలు !

2015లో భారత్‌లో తయారీ యూనిట్ల ద్వారా అత్యున్నతమైన నాణ్యతా ప్రమాణాలతో స్మార్ట్ ఫోన్ల ను షియోమీ అందిస్తోంది. ప్రస్తుతం భారత్ మార్కెట్లో షియోమీ ఒక సంచలనంగా మారడంతో పాటు మేకిన్ ఇండియా పిలుపు మేరకు తయారీ యూనిట్లను సైతం ప్రారంభిస్తున్నట్లు షియోమి గ్లోబల్ ఎండీ మను జైన్ తెలిపారు.

English summary
Xiaomi's App vault application receives new "Todays's Deals" card More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot