హైదరాబాద్‌లో Mi Home స్టోర్

షియోమీ తన Mi Home Storeను హైదరాబాద్‌లో ప్రారంభించబోతోంది. సెప్టంబర్ 12 నుంచి మాదాపూర్ మెయిన్ రోడ్‌లోని గేర్ అప్ ఎలైట్‌లో ఈ స్టోర్ ఆపరేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచే స్టోర్ సేవలు పబ్లిక్‌కు అందుబాటులో ఉంటాయి. షియోమికి సంబంధించిన అన్ని స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఈ స్టోర్ వద్ద అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్‌లో Mi Home స్టోర్

Read More : రూ.15,000లో బెస్ట్ డ్యుయల్ కెమెరా ఫోన్స్ ఈ నాలుగే!

వీటిని ఎక్స్‌పీరియన్స్ చేయటంతో పాటు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. రానున్న రెండు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా మరో 100 Mi Home Storeలను లాంచ్ చేయనున్నట్లు షియోమీ తెలిపింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ఇంకా చెన్నై వంటి మెట్రో నగరాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 10,000 వరకు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో షియోమీ ఫోన్‌లు లభ్యమవుతున్నాయి.

హైదరాబాద్‌లో Mi Home స్టోర్

Read More : విడుదలకు సిద్దమవుతోన్న Airtel VoLTE

షియోమి తన మొదటి ఎంఐ (Mi) స్టోర్‌ను మే 20 బెంగుళూరులో ప్రారంభించింది. ఈ స్టోర్ మొదటి 12 గంటల్లోనే 5 కోట్ల అమ్మకాలను నమోదు చేయటం విశేషం. ప్రస్తుతం బెంగుళూరులోని మూడు ప్రాంతాలతో పాటు చెన్నై, గురుగ్రామ్ ప్రాంతాల్లో ఎంఐ హోమ్ స్టోర్‌లు రన్ అవుతున్నాయి. త్వరలోనే హైదరాబాద్ లోనూ ఈ స్టోర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

English summary
Xiaomi's First Mi Home Flagship Retail Store in Hyderabad Opens September 12. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot