Home
News

షియోమి నుంచి 5 కెమెరాలతో ఫోల్డబుల్ ఫోన్

By Gizbot Bureau

ఇప్పుడు మొబైల్ మార్కెట్లో అంతా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లదే హవా అని చెప్పవచ్చు.ఇందులో భాగంగానే అద్భుతమైన ఫీచర్లతో పాటు స్మార్ట్ ఫోన్ డిజైన్ పై కూడా మొబైల్ కంపెనీలు ప్రత్యేక దృష్టిపెడుతున్నాయి. యూజర్లను ఆకట్టుకునేందుకు అత్యాధునిక డిజైన్లతో లేటెస్ట్ ఫీచర్లతో ఫోన్లు మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. ఇప్పటికే కొన్ని దిగ్గజ స్మార్ట్ ఫోన్ మేకర్లు ఫోల్డబుల్ డివైజ్ లను రూపొందించాయి. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన ఫోల్డబుల్ ఫోన్ ను గత కొద్ది రోజుల క్రితం ఇండియాలో లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో చైనీస్ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ కూడా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను రూపొందిస్తోంది.

5 కెమెరాల సెటప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్

5 కెమెరాల సెటప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్

ఇందులో షియోమీ భాగంగా 5 కెమెరాల సెటప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ పేటెంట్ దక్కించుకుంది. యూజర్ వినియోగానికి తగినట్టుగా ఫోల్డబుల్ ఫోన్లను బయటకు ఫోల్డింగ్ స్క్రీన్ అయ్యేలా డిజైన్ చేసింది.

థిన్ బెజిల్స్, నో డిస్ ప్లే నాచ్

థిన్ బెజిల్స్, నో డిస్ ప్లే నాచ్

యూజర్ ఎలా వాడితే అలా ఐదు కెమెరాలు రియర్ కెమెరాలుగా లేదా ఫ్రంట్ కెమెరాలుగా మారిపోతాయని ఓ పోర్టల్ రిపోర్టు తెలిపింది. డివైజ్ లోని స్కెచెస్ చూస్తే థిన్ బెజిల్స్, నో డిస్ ప్లే నాచ్ ఉంది. అయితే పూర్తి ఫీచర్లు ఇంకా తెలియనప్పటికీ అత్యాధునికంగా ఇది మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది. 

ఎడమ పక్కన పాప్-అప్ సిట్

ఎడమ పక్కన పాప్-అప్ సిట్

దీనికి సంబంధించి పేటెంట్ కోసం షియోమీ ఆగస్టు 20న దరఖాస్తు చేయగా గతవారమే ఆమోదం లభించింది. ఫోల్డబుల్ ఫోన్ ఓపెన్ చేసిన సమయంలో ఎడమ పక్కన పాప్-అప్ సిట్ కనిపిస్తోంది. 

Mi CC9 ప్రో

Mi CC9 ప్రో

కాగా గతవారమే షియోమీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 5 రియర్ కెమెరాలతో Mi CC9 ప్రోను చైనాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 108MP భారీ ప్రైమరీ సెన్సార్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ ఫీచర్లలో 6.47 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ (1080x2340ఫిక్సల్స్) OLED డిస్ ప్లేతో వచ్చింది. ఈ డివైజ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 730G ప్రాసెసర్ ఉండగా, 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది.

Best Mobiles in India

English summary
Xiaomi's foldable phone to come with five pop-up cameras; launching soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X