భారత్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన షియోమీ!

By: Madhavi Lagishetty

షియోమీ...భారతదేశంలో రెండవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. షియోమీ డివైస్లు, ప్రైస్ స్ట్రాటజీ అత్యంత ప్రజాదరణ పొందాయి. రెడ్మీ నోట్ 4, రెడ్మీ 4ఏ వంటి బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది కంపెనీ.

భారత్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన షియోమీ!

షియోమీ కంపెనీ మూడు సంవత్సరాల్లోనే దేశంలో 25మిలియన్ల స్మార్ట్ ఫోన్లను సేల్ చేసినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. షియోమీ స్మార్ట్ ఫోన్లను ప్రారంభించినప్పటి నుంచి తక్కువ ధరతో పాటు మోడ్రన్ స్పెక్స్ స్మార్ట్ ఫోన్లను తయారు చేయడంలో కంపెనీ అద్భుతమైన విజయం సాధించింది.

గత మూడు సంవత్సరాలుగా షియోమీ యావరేజ్ గా ప్రతిరోజు 22వేల స్మార్ట్ ఫోన్లను అమ్మినట్లు ప్రకటించింది. ఈ బ్రాండ్ ప్రధానంగా ఫ్లాష్ సేల్ మోడల్స్ పై ఆధారపడుతుంది. ఇది ఖచ్చితంగా మంచి విజయం సాధించిందని చెప్పొచ్చు. అమ్మకాల రేటులో షియోమీ 25మిలియన్ల మార్క్ చేరుకోవడంతోపాటు అత్యంత ఫాస్టెస్ట్ బ్రాండ్ గా గుర్తింపు పొందింది.

Mi A1 లాంచ్ అయ్యింది, ధర రూ.14,999.. సెప్టంబర్ 12 నుంచి సేల్

జూలై 2104లో దేశంలో లాంచ్ చేసిన తొలి ఆరునెలల్లో సంస్ధ దాదాపు 5 మిలియన్ల స్మార్ట్ ఫోన్లను సేల్ చేసింది. ఇంతేకాదు షియోమీ రెడ్మీ నోట్ 4 ఈ ఏడాది సగభాగంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ ఫోన్ల్ గా హిస్టరి క్రియేట్ చేసింది.

ప్రస్తుతం షియోమీ నుంచి మూడు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. రెడ్మీ 4ఏ, రెడ్మీ4, రెడ్మీనోట్ 4. ఈ స్మార్ట్ ఫోన్లు పదివేలకంటే తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు కంపెనీ ఇస్తున్న ఆఫర్స్ తో దేశంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అమ్మకాల సంఖ్య పెరగడానికి షియోమీ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ యొక్క న్యూ వెర్షన్ను ప్రకటించడమే కారణం. 3జిబి మరియు 32జిబి స్టోరెజీ తోపాటు 6,999రూపాయలకు రెడ్మీ4ఏ యూజర్లకు అందుబాటులో ఉంది.

ఇప్పటికే ఉన్న ప్రొడక్ట్స్ కు ఎంతో ప్రజాదరణ ఉన్నప్పటికీ...సెప్టెంబర్ 5న దేశంలో మరో స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే స్మార్ట్ ఫోన్ పేరును ఇంకా ప్రకటించలేదు.

Read more about:
English summary
Xiaomi has announced that they have sold over 25 million smartphones in India since their launch here three years back.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot