Xiaomi స్మార్ట్‌టీవీ 5A & OLED విజన్ టీవీలు లాంచ్ అయ్యాయి!! అందుబాటు ధరలో అద్భుతమైన ఫీచర్లు...

|

షియోమి స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నేడు భారతదేశంలో జరిగిన షియోమి నెక్స్ట్ ఈవెంట్‌లో షియోమి 12 ప్రో ఫ్లాగ్‌షిప్ ఫోన్ మరియు షియోమి ప్యాడ్ 5 తో పాటుగా షియోమి స్మార్ట్‌టీవీ 5A ని 32-, 40- మరియు 43-అంగుళాల పరిమాణాలలో లాంచ్ చేసింది. ఇది DTS-X మరియు డాల్బీ ఆడియో సపోర్ట్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. అలాగే దీనితో పాటుగా కంపెనీ దేశంలో OLED లైనప్‌లో తన విజన్ OLED టీవీని మొదటి మోడల్‌గా పరిచయం చేసింది. ఈ కొత్త స్లిమ్మెస్ట్ టీవీ 1500000:1 కాంట్రాస్ట్ రేషియో మరియు IMAX ఎన్‌హాన్స్‌డ్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

షియోమి స్మార్ట్‌టీవీ 5A ధరల వివరాలు

షియోమి స్మార్ట్‌టీవీ 5A ధరల వివరాలు

షియోమి స్మార్ట్‌టీవీ 5A ఇండియాలో 32-, 40- మరియు 43-అంగుళాల పరిమాణాలలో విడుదలైంది. ఇందులో 32-అంగుళాల ధర రూ.15,499 కాగా 40-అంగుళాల మోడల్ ధర రూ.22,999 అయితే చివరిది 43-అంగుళాల వేరియంట్ యొక్క ధర రూ.25,999. ఈ మూడు మోడల్‌లను మొదటి సేల్స్ లో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో EMI ఎంపికల ద్వారా కొనుగోలు చేసే కస్టమర్‌లకు రూ.2,000 వరకు తగ్గింపుతో పొందేందుకు అర్హులు. ఇవి ఏప్రిల్ 30 మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart, Mi.com, Mi Home స్టోర్‌లు మరియు ఆఫ్‌లైన్ రిటైలర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నాయి.

షియోమి OLED విజన్ టీవీల ధరల వివరాలు

షియోమి OLED విజన్ టీవీల ధరల వివరాలు

భారతదేశంలో షియోమి OLED విజన్ టీవీ యొక్క 55-అంగుళాల పరిమాణానికి రూ.89,999 ధర వద్ద లభించింది. ఇది మే 19 మధ్యాహ్నం 12 గంటల నుండి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, Mi.com, Mi హోమ్ స్టోర్‌ల ద్వారా మరియు ఆఫ్‌లైన్ రిటైలర్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యొక్క నో-కాస్ట్ EMI ఎంపికతో కొనుగోలు చేసే కస్టమర్‌లకు రూ.6,000 తగ్గింపు లభిస్తుంది. ప్రారంభంలో టీవీని కొనుగోలు చేసే కస్టమర్‌లు మూడు సంవత్సరాల ఉచిత కాంప్లిమెంటరీని పొందుతారు.

షియోమి స్మార్ట్ TV 5A స్పెసిఫికేషన్స్

షియోమి స్మార్ట్ TV 5A స్పెసిఫికేషన్స్

షియోమి స్మార్ట్ TV 5A యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 32-, 40- మరియు 43-అంగుళాల స్క్రీన్ పరిమాణాలలో వస్తుంది. 40- మరియు 43-అంగుళాల మోడల్‌లు ఫుల్-HD రిజల్యూషన్ మద్దతును కలిగి ఉంటాయి. 32-అంగుళాల మోడల్ HD-రెడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 11 ఆధారంగా ప్యాచ్‌వాల్ 4ని అమలు చేస్తుంది. ఇది క్వాడ్-కోర్ కార్టెక్స్-A55 CPU మరియు 1.5GB RAM ద్వారా అందించబడుతుంది. అయితే 32-అంగుళాల వేరియంట్‌లో 1GB RAM ఉంది. టీవీ స్టాండర్డ్‌గా 8GB స్టోరేజ్‌తో కూడా వస్తుంది. సౌండ్ పరంగా షియోమి స్మార్ట్ TV 5A 24W ఆడియో అవుట్‌పుట్‌తో పాటు DTS-X, DTS వర్చువల్-X మరియు డాల్బీ ఆడియోకు మద్దతును కలిగి ఉంది. అయితే 32-అంగుళాల మోడల్‌కు DTS:X మద్దతు లేదు.

షియోమి OLED విజన్ టీవీ స్పెసిఫికేషన్స్

షియోమి OLED విజన్ టీవీ స్పెసిఫికేషన్స్

Xiaomi OLED విజన్ టీవీ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ప్యాచ్‌వాల్‌తో పాటుగా 97 శాతం స్క్రీన్-టు-బాడీ డిజైన్‌ను మరియు 'బెజెల్స్-లెస్' డిజైన్‌తో వస్తుంది. OLED TVలోని 55-అంగుళాల డిస్‌ప్లే 3,840x2,160 పిక్సెల్‌లతో జీరో నుంచి హై బ్రైట్‌నెస్‌కి బట్వాడా చేయగలదు. ఇది రియాలిటీఫ్లో మరియు TUV సర్టిఫికేషన్‌తో MEMCతో పాటు 1.07 బిలియన్ కలర్లను ఉత్పత్తి చేయడానికి నిజమైన 10-బిట్ కలర్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది. TV 3GB RAM మరియు 32GB నిల్వతో జత చేయబడిన క్వాడ్-కోర్ కార్టెక్స్-A73 CPU ద్వారా శక్తిని పొందుతుంది. ఇది డాల్బీ విజన్ IQ మద్దతును కూడా కలిగి ఉంది మరియు వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2ని కలిగి ఉంది. 98.5 శాతం DCI-P3 కలర్ గామట్ సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ విషయంలో ఇందులో మూడు HDMI 2.1, రెండు USB మరియు ఈథర్నెట్ పోర్ట్ ఉన్నాయి. టీవీలో AV ఇన్‌పుట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు ఆప్టికల్ పోర్ట్ కూడా ఉన్నాయి. ఇంకా ఇది Wi-Fi 6 మరియు బ్లూటూత్ v5.0తో వస్తుంది.

Best Mobiles in India

English summary
Xiaomi Smart TV 5A, OLED Vision TV Launched in India: Price, Specs, Sale Date, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X