Home
News

ధర రూ. 12,499 కే Xiaomi కొత్త టీవీ లాంచ్! స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు

షియోమీ సంస్థ తక్కువ ధరలో కేవలం రూ. 12,000 లలో కొత్త స్మార్ట్ టీవీ పరికరాలను పరిచయం చేయడం ద్వారా భారతదేశాన్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు, మరో కొత్త Xiaomi స్మార్ట్ టీవీ పరికరాలను లాంచ్ చేసింది. వాటి స్పెసిఫికేషన్లు, ఎక్కడ కొనుగోలు చేయాలో వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

షియోమీ సంస్థ ఇప్పుడు 32" అంగుళాల, 40" అంగుళాల మరియు 43" అంగుళాల లో మూడు డిస్‌ప్లే పరిమాణాలతో కొత్త స్మార్ట్ టీవీ పరికరాలను లాంచ్ చేసింది. ఇవి Xiaomi స్మార్ట్ టీవీ A సిరీస్ లో ప్రవేశపెట్టడం గమనార్హం.

Xiaomi Smart TV A Series 2024 launched in India

Xiaomi స్మార్ట్ TV A సిరీస్ 2024 ఎడిషన్ స్పెసిఫికేషన్లు:
షియోమీ గత సంవత్సరం తన షియోమీ A సిరీస్ 2023 స్మార్ట్-TV మోడల్‌లను పరిచయం చేసింది మరియు ఇప్పుడు కంపెనీ దానిని కొత్త Xiaomi Smart TV A సిరీస్ 2024 ఎడిషన్ మోడల్‌లతో అప్‌గ్రేడ్ చేసింది. ఈ కొత్త షియోమీ స్మార్ట్ TV A సిరీస్ 2024 మోడల్ లైనప్ క్రింద కంపెనీ 3 బడ్జెట్ స్మార్ట్ టీవీ మోడళ్లను విడుదల చేసింది.

ఇప్పుడు వివరాలు మరియు ధర సమాచారాన్ని తనిఖీ చేయండి. ఈ కొత్త షియోమీ స్మార్ట్ టీవీ A సిరీస్ 32" అంగుళాల డిస్‌ప్లే మోడల్ క్వాడ్ కోర్ కార్టెక్స్ A35 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో వస్తుంది. మరోవైపు, షియోమీ యొక్క కొత్త 40" అంగుళాల మరియు 43" అంగుళాల మోడల్ టీవీలు క్వాడ్ కోర్ కార్టెక్స్ A55 ప్రాసెసర్ తో వచ్చింది.

షియోమీ ప్రవేశపెట్టిన ఈ కొత్త స్మార్ట్ TV మోడల్స్ Xiaomi TV ప్లస్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. ఇది 150 లైవ్ ఛానెల్ సపోర్ట్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క 32" అంగుళాల డిస్‌ప్లే పరికరం 1366 x 768 రిజల్యూషన్‌తో వస్తుంది. అదేవిధంగా, దాని 40" అంగుళాల మరియు 43" అంగుళాల మోడల్ FHD డిస్‌ప్లేతో వస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ లైన్‌లో ప్రవేశపెట్టిన అన్ని 3 మోడల్‌లు 60Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తున్నాయి. ఇందులో 16.7 మిలియన్ కలర్ డెప్త్, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ మరియు వివిడ్ పిక్చర్ ఇంజిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ కొత్త Xiaomi స్మార్ట్ TV A సిరీస్ 2024 యొక్క 32-అంగుళాల మోడల్ 1GB RAMని అందిస్తుంది. మరోవైపు 40 "అంగుళాల మరియు 43" అంగుళాల మోడల్‌లు 1.5GB RAMని అందిస్తాయి. మూడు మోడల్స్ 8GB స్టోరేజ్‌తో వస్తాయి. ఈ టీవీ ప్యాచ్‌వాల్+కి మద్దతు ఇస్తుంది.

ఆండ్రాయిడ్ 11 మరియు Xiaomi TV+ తో కూడిన Google TV ఫీచర్ తో 20W అవుట్‌పుట్ ఆడియో మరియు డాల్బీ ఆడియో మరియు DTS X సపోర్ట్ వంటి ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. ఇది బ్లూటూత్ 5.0, HDMI, WiFi, USB 2.0 మరియు ఈథర్‌నెట్‌లను కూడా కలిగి ఉంది.

Xiaomi Smart TV A సిరీస్ 2024 ధర వివరాలు
ఈ కొత్త షియోమీ స్మార్ట్ టీవీ A సిరీస్ 2024 ఎడిషన్ 32" మోడల్ అమెజాన్‌లో రూ. 12,499 కి అందుబాటులో ఉంది. 40" మరియు 43" మోడల్‌లు వరుసగా రూ. 22,999 మరియు రూ. 24,999 కు అందుబాటులో ఉంటాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi Smart TV A Series 2024 launched in India. Price Starts From Rs 12,499. Specifications And Sale Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X