మడతపెట్టే ఫోన్‌లను లాంచ్ చేయనున్న Xiaomi !! ధర మీరే ఊహించండి...
ఇండియాలో స్మార్ట్‌ఫోన్ విభాగంలో అతి వేగంగా అభివృద్ధి చెందిన సంస్థలలో షియోమి అందరి కంటే ముందు వరుసలో ఉంటుంది. అయితే ఈ సంస్థ ఇంకా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగు పెట్టలేదు. అయితే ఈ కొరతను 2021 లో మార్చబోతున్నది. 2021లో కొత్తగా మూడు ఫోల్డబుల్ ఫోన్‌లను లాంచ్ చేయడానికి ఈ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ప్లాన్ చేసింది. ప్రస్తుతం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగాన్ని దక్షిణ కొరియా సంస్థ సామ్‌సంగ్ శాసిస్తోంది.

xiaomi foldable phone 2021
సామ్‌సంగ్ సంస్థ ఇప్పటివరకు Z ఫోల్డ్ 2 మరియు జెడ్ ఫ్లిప్ వంటి మూడు ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేసింది. 2020 లో లాంచ్ చేసిన గెలాక్సీ జెడ్ ఫ్లిప్ నిలువుగా మడతపెట్టే స్మార్ట్‌ఫోన్ అయితే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 అడ్డంగా మడతపెట్టే స్మార్ట్‌ఫోన్ అవ్వడం విశేషం. షియోమి సంస్థ ఇప్పుడు మూడు వేర్వేరు రూపాల్లో ఫోల్డబుల్ ఫోన్‌లను 2021 లో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

షియోమి ఫోల్డబుల్ ఫోన్లలో లభించే ఫీచర్స్
డిస్ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ (DSCC) యొక్క CEO రాస్ యంగ్ తెలిపిన వివరాల ప్రకారం ఫ్లాగ్‌షిప్ Mi 11 సిరీస్ వచ్చే వారం లాంచ్ అవుతున్నప్పటికి 2021 లో షియోమి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు. 2021 క్యూ 1 లో ఫ్లాగ్‌షిప్ లాంచ్‌లతో పాటుగా మూడు ఫోల్డబుల్ ఫోన్లను వేర్వేరు డిజైన్లతో లాంచ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

షియోమి ఫోల్డబుల్ ఫోన్ vs శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్
షియోమి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ యొక్క మొదటి ఫోల్డబుల్ ఫోన్ అవుట్‌ఫోల్డింగ్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. అలాగే రెండవది ఇన్-ఫోల్డింగ్ మరియు మూడవది క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫీచర్లతో రాబోతున్నట్లు సమాచారం. శామ్సంగ్ సంస్థ ఇప్పటికే ఇన్-ఫోల్డింగ్ మరియు క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్ డిజైన్ ను తమ యొక్క ఫోన్ లలో ఉపయోగించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న శామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్‌లతో పోలిస్తే షియోమి డిజైన్‌లలో మెరుగైన వృద్ధితో రాబోతున్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. మరోవైపు రాయోల్ వంటి కొన్ని చాలా బ్రాండ్లు అవుట్‌ఫోల్డింగ్ ఫోల్డబుల్ ఫోన్‌లను ప్రారంభించటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

2021లో ఫోల్డబుల్ ఫోన్‌ల లాంచ్ వివరాలు
షియోమి సంస్థతో పాటుగా ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లైన ఒప్పో మరియు శామ్‌సంగ్ కూడా అవుట్‌ఫోల్డింగ్ ఫీచర్లతో ఫోన్‌లను తయారుచేసే పనిలో ఉన్నట్లు సమాచారం. 2021 లో శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 2, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 మరియు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ లైట్ అనే మూడు ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేస్తుంది. 2021 సంవత్సరం ఫోల్డబుల్ ఫోన్‌ల సంవత్సరంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చైనా యొక్క మరిన్ని బ్రాండ్లు ఫోల్డబుల్ విభాగంలో అడుగుపెడుతున్నాయి.


Click it and Unblock the Notifications








