రెడ్‌మి నోట్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ ధరలను పెంచిన షియోమి సంస్థ!! ఎంతనో తెలుసా??

|

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్మార్ట్‌ఫోన్ అమ్మకందారులలో ఒకరైన షియోమి సంస్థ 2021 మార్చిలో రెడ్‌మి నోట్ 10 సిరీస్‌ ఫోన్ లను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో రెడ్‌మి నోట్ 10, రెడ్‌మి నోట్ 10 ప్రో, మరియు రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ వంటి పలు స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ విడుదల చేసింది. షియోమి కంపెనీ మరియు ఇతర చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు తమ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటాయని అందరికీ తెలుసు. ఇప్పుడు గిజ్మోచినా నుండి వచ్చిన నివేదిక ప్రకారం షియోమి సంస్థ తన రెడ్‌మి నోట్ 10 ప్రో ధరను పెంచనున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ఫోన్ యొక్క కొత్త ధరల వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

షియోమి రెడ్‌మి నోట్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ పెరిగిన కొత్త ధరల వివరాలు

షియోమి రెడ్‌మి నోట్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ పెరిగిన కొత్త ధరల వివరాలు

షియోమి స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ భారతదేశంలో వనిల్లా రెడ్‌మి నోట్ 10 ఫోన్ యొక్క ధరను రూ.500 పెంచింది. ధర మార్పు రెడ్‌మి నోట్ 10 యొక్క అన్ని రకాల మీద కూడా ప్రభావితం చేసింది. అయితే రెడ్‌మి నోట్ 10 ప్రో ధరల విషయంలో కూడా రూ.500 వరకు పెరుగుదలను అందుకున్నది. అయితే ఈ ధరల పెరుగుదల దాని 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే అమలు చేయబడింది. ఈ వేరియంట్‌ ఇండియాలో మొదట రూ.16,999 ధర వద్ద లాంచ్ అయింది. కానీ ధరల పెరుగుదల తరువాత అదే వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి ఇప్పుడు రూ.17,499 ఖర్చవుతుంది. ఈ ఫోన్ యొక్క అన్ని రంగు వేరియంట్‌లకు ధరల పెరుగుదల లభించింది.

 

Reamle వార్షికోత్సవ సేల్!! కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద ఊహించని ఆఫర్స్...Reamle వార్షికోత్సవ సేల్!! కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద ఊహించని ఆఫర్స్...

రెడ్‌మి నోట్ 10 ప్రో

కాబట్టి ఇప్పుడు రెడ్‌మి నోట్ 10 ప్రో భారతదేశంలో మూడు వేరియంట్లలో లభిస్తుంది - A) 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ధర రూ.15,999, B) 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ధర రూ.16,999 చివరిగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.18,999. అయితే రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ ధరల పెంపును అందుకోలేదు. ఇది ఇప్పుడు ఇండియాలో గతంలో లాంచ్ అయిన అదే ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మి నోట్ 10 ప్రో స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 10 ప్రో స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 10 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12 పై తో రన్ అవుతువుంది. ఇది HDR-10 మద్దతు మరియు TÜV రీన్‌ల్యాండ్ తో 6.67-అంగుళాల ఫుల్-HD + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది బ్లూ లైట్ సర్టిఫికేషన్ తో వస్తుంది. అలాగే ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 జి SoC చేత శక్తినిస్తుంది, దీనితో పాటు అడ్రినో 618 జిపియు మరియు 8 జిబి వరకు LPDDR4x ర్యామ్ ఉన్నాయి. ఆప్టిక్స్ విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో గల క్వాడ్ రియర్ కెమెరా సెటప్ లో 64 మెగాపిక్సెల్ ప్రాధమిక శామ్‌సంగ్ ISOCELL GW3 సెన్సార్‌తో పాటు 5 మెగాపిక్సెల్ సూపర్ మాక్రో షూటర్‌తో పాటు 2x జూమ్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్- యాంగిల్ షూటర్ మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ కూడా ఉంది.

 

 

WhatsApp New Scam: 3 నెలల ఇంటర్నెట్‌ను ఉచితంగా అందిస్తున్న జియో, ఎయిర్‌టెల్,Vi!! వాట్సాప్‌లో నకిలీ మెసేజ్WhatsApp New Scam: 3 నెలల ఇంటర్నెట్‌ను ఉచితంగా అందిస్తున్న జియో, ఎయిర్‌టెల్,Vi!! వాట్సాప్‌లో నకిలీ మెసేజ్

రెడ్‌మి నోట్ 10 ప్రో ఫీచర్స్

రెడ్‌మి నోట్ 10 ప్రో యొక్క స్టోరేజ్ మరియు ఇతర ఫీచర్ల విషయానికొస్తే ఇది 128GB వరకు UFS 2.2 స్టోరేజ్ ను కలిగి ఉంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ ప్రత్యేకమైన స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఇన్‌ఫ్రారెడ్, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అలాగే ఇది 360-డిగ్రీల యాంబియంట్ లైట్ సెన్సార్ను కలిగి ఉంటుంది.

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12 తో రన్ అవుతుంది. ఇది 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే HDR-10 సపోర్ట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. ఇది TÜV రీన్‌ల్యాండ్ లైట్ బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉండి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. అలాగే ఇది 8GB LPDDR4x RAM తో మరియు ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 732G SoC చేత జతచేయబడి ఉంది.

ఫోటోగ్రఫి

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ యొక్క ఫోటోగ్రఫి విషయానికి వస్తే వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 108 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ HM2 ప్రైమరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ సూపర్ మాక్రో షూటర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్ మరియు 2 -మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెన్సార్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

మైక్రో SD కార్డ్ స్లాట్

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ ఫోన్ యొక్క స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 128GB వరకు ఇంటర్నల్ UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఇన్‌ఫ్రారెడ్ (IR), యుఎస్‌బి టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,020mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. చివరగా ఇది 164.5x76.15x8.1mm కొలతల పరిమాణంతో 192 గ్రాముల బరువుతో వస్తుంది.

Best Mobiles in India

English summary
Xiaomi Smartphone Company Raised The Redmi Note 10 Pro Prices

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X