10 ఫోన్లు అమ్ముడైతే 9 ఫోన్లు దానివే ! దుమ్మురేపుతున్న షియోమి
చైనా దిగ్గజం షియోమి దసరాను బాగా సెలబ్రేట్ చేసుకుంటోంది.
చైనా దిగ్గజం షియోమి దసరాను బాగా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఆ కంపెనీకి చెందిన ఫోన్లు ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియాలు నిర్వహిస్తున్న మెగా సేల్ ఈవెంట్స్‌లో దుమ్మురేపుతున్నాయి. కేవలం రెండు రోజుల్లో 10 లక్షల షావోమి స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోయాయి. సగటున ప్రతి నిమిషానికి 300కు పైగా స్మార్ట్‌ఫోన్లు అమ్ముడపోయినట్టు షియోమి తెలిపింది.

రెడ్‌మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్లు
ఈ సీజన్‌లో రెడ్‌మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్లు హాట్‌కేక్‌లా అమ్ముడుపోతున్నట్టు తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న స్మార్ట్‌ఫోన్‌గా రెడ్‌మి నోట్4 పేరులోకి వచ్చిన కంపెనీ చెప్పింది.

అమెజాన్ ఇండియాలో
అమెజాన్ ఇండియాలో కూడా అమ్ముడుపోతున్న తొమ్మిది స్మార్ట్‌ఫోన్లలో ఎనిమిది షియోమికి చెందినవే ఉన్నాయని తెలిసింది.

మొబైల్ కేటగిరీలో
మొబైల్ కేటగిరీలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో షియోమి నెంబర్ వన్ బ్రాండుగా నిలుస్తోంది. ఇంత అద్భుతమైన మద్దతు అందిస్తున్నందుకు ఎంఐ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు షియోమి ఇండియా ఆన్‌లైన్ సేల్స్ హెడ్ రఘు రెడ్డి చెప్పారు.

షియోమి రెడ్మి 4 స్పెసిఫికేషన్లు
2/3/4gb ram
2.5డి కర్వ్‌డ్ ఎడ్జ్‌తో 5 అంగుళాల హెచ్‌డీ డిస్ప్లే
స్నాప్‌డ్రాగన్ 435 ఆక్టాకోర్ ప్రాసెసర్
వెనుక 13 ఎంపీ పీడీఏఎఫ్ కెమెరా
బ్యూటీఫై మోడ్‌తో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
4100 ఎంఏహెచ్ బ్యాటరీ
4జీ వివోఎల్టీఈ, డ్యుయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్


Click it and Unblock the Notifications