ఇక తిరుపతిలోనే స్మార్ట్ టీవీల తయారీ, కొత్త యూనిట్‌ను స్టార్ట్ చేసిన Xiaomi

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి (Xiaomi), తన సరికొత్త స్మార్ట్ టీవీ అసెంబ్లింగ్ యూనిట్‌ను తిరుపతిలో ప్రారంభించింది.

|

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి (Xiaomi), తన సరికొత్త స్మార్ట్ టీవీ అసెంబ్లింగ్ యూనిట్‌ను తిరుపతిలో ప్రారంభించింది. ఈ కొత్త ప్రొడక్షన్ లైన్‌ను డిక్సన్ టెక్నాలజీస్‌తో కలిసి షియోమి ముందుకు నడిపించబోతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 7 ప్రొడక్షన్ లైన్‌లను నెలకొల్పిన షియోమి, తాజాగా ఎనిమిదవ యూనిట్‌ను తిరుపుతిలో ఏర్పాటు చేసింది.

6 యూనిట్లు ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్‌ల కోసమే..

6 యూనిట్లు ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్‌ల కోసమే..

ఈ 8 యూనిట్‌లలో 6 యూనిట్లు ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే అసెంబుల్ చేస్తాయి. ఒక యూనిట్ మాత్రం పవర్ బ్యాంక్‌లను అసెంబుల్ చేస్తుంది. మరో యూనిట్ ప్రత్యేకించి స్మార్ట్ టీవీలను మాత్రమే అసెంబుల్ చేస్తుంది. ఈ ప్రొడక్షన్ లైన్‌లను ఫాక్స్‌కాన్, హైప్యాడ్ టెక్నాలజీస్, డిక్సట్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో షావోమి నడిపిస్తోంది. ఈ ప్లాంట్స్ ఆంధ్రప్రదేశ్ (శ్రీసిటీ), తమిళనాడు (శ్రిపెరంబుదూర్), ఉత్తర్‌ప్రదేశ్ (నోయిడా)లలో ఏర్పాటై ఏన్నాయి.

 

 

జనవరి నాటికి నెలకు లక్ష టీవీల తయారీ..

జనవరి నాటికి నెలకు లక్ష టీవీల తయారీ..

నూతనంగా ఏర్పాటు చేసిన తిరుపతి యూనిట్‌లో స్మార్ట్ టీవీ ప్రొడక్షన్ ప్రాసెస్ నిధానంగా పందుకుంటుందుని, వచ్చే జనవరి -మార్చి క్వార్టర్ నాటికి నెలకు లక్ష టీవీలను అసెంబుల్ చేసే దిశగా వర్క్ ఫోర్సును సమకూర్చుకుంటామని షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను జెయిన్ తెలిపారు. ఈ ప్లాంట్‌ ఏర్పాటు కాక ముందు టీవీలను చైనా నుంచి దిగుమతి చేసుకోవల్సి వచ్చేదని, ఇప్పుడు కాంపోనెంట్స్ మాత్రమే దిగుమతి చేసుకుంటే సరిపోతుందని ఆయన తెలిపారు.

నెం.1 స్మార్ట్ టీవీ బ్రాండ్‌గా షియోమి ..

నెం.1 స్మార్ట్ టీవీ బ్రాండ్‌గా షియోమి ..

ఇండియన్ స్మార్ట్ టీవీ మార్కెట్లో మొదటి స్థానాన్ని సెక్యూర్ చేసుకున్న షియోమి, ఆ స్థానాన్ని పదిలపరుచుకునే ప్రాసెస్‌లో లోకల్ అసెంబ్లింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. షియోమి స్మార్ట్ టీవీలు, 2018 మొదటి క్వార్టర్‌లో భారత్‌లో లాంచ్ అయ్యాయి. వీటికి ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగిపోవటంతో రెండవ క్వార్టర్ నాటికి అమ్మకాలు మూడు రెట్లకు ఎగబాకాయి. దీంతో భారతదేశపు నెం.1 స్మార్ట్ టీవీ బ్రాండ్‌గా షియోమి రికార్డ్ సృష్టించింది.

ఇప్పటి వరకు 5 లక్షల టీవీ విక్రయాలు..

ఇప్పటి వరకు 5 లక్షల టీవీ విక్రయాలు..

స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ఇప్పటికే నెం.1 బ్రాండ్‌గా కొనసాగుతోన్న షియోమి తన పరిధిని ఇతర విభాగాలకు విస్తరించుకోవాలని చూస్తోంది. షియోమి తన మొదటి స్మార్ట్ టీవీని ఫిబ్రవరి, 2018లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీని ప్రపంచపు అతిపలచటి ఎల్ఈడి టీవీగా షావోమి అభివర్ణించింది. తన మొదటి స్మార్ట్ టీవీని మార్కెట్లో లాంచ్ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు 5 లక్షల టీవీలను మార్కెట్లో విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.

 

 

 

30 నుంచి 40 క్యాటగిరీలకు ప్రొడక్ట్ రేంజ్‌..

30 నుంచి 40 క్యాటగిరీలకు ప్రొడక్ట్ రేంజ్‌..

షియోమి స్మార్ట్ టీవీలు మార్కెట్లో లాంచ్ అయిన తరువాత ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న సామ్‌సంగ్, సోనీ ఇంకా ఎల్‌జీ స్మార్ట్ టీవీలను గట్టిపోటీ ఎదురైనట్లయ్యింది. షియోమి తన స్మార్ట్ టీవీలను రూ.13,999 నుంచి రూ.49,999 మధ్య విక్రయిస్తోంది. భారత్‌లో షియోమి తన ప్రొడక్ట్ రేంజ్‌ను 30 నుంచి 40 క్యాటగిరీలకు విస్తరించింది. వాటిలో ఫోన్‌లు, టీవీలు, ఫిట్నెస్ డివైసెస్, పవర్ బ్యాంక్స్, ఎయిర్ ప్యూరిఫైర్స్, స్మార్ట్ రౌటర్స్ ఇంకా పలు ఆడియో ప్రొడక్ట్స్ ఉన్నాయి.

 

 

Best Mobiles in India

English summary
Xiaomi starts assembling smart TVs in India.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X