Xiaomi యొక్క వేగవంతమైన 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌ టెక్....

|

వైర్‌లెస్ ఛార్జింగ్ అనేది ఇప్పుడు చాలా రకాల కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో సాధారణమైంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సాంప్రదాయకంగా నెమ్మదిగా ఉన్నందున దానిని పెద్ద ఎత్తున మార్చడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు.

 

షియోమి

అందులో భాగంగా ఇప్పుడు షియోమి 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్‌ను టీజ్ చేసింది. వివో సంస్థ తన అపెక్స్ 2020 కాన్సెప్ట్ ఫోన్ ను 60W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ చేయబోతున్నది.

 

 

Oppo Kash: అప్పు కావాలా? ఇప్పుడు దీని ద్వారా సులభంగా పొందవచ్చు!!!Oppo Kash: అప్పు కావాలా? ఇప్పుడు దీని ద్వారా సులభంగా పొందవచ్చు!!!

ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్

ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్

షియోమి సంస్థ ఇప్పుడు ‘ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్' టెక్‌లో 40W అవుట్‌పుట్ సపోర్ట్‌ను కలిగి ఉన్న ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో టీజర్ లో షియోమి యొక్క వేగవంతమైన వైర్‌లెస్ ఛార్జింగ్ గురించి తెలిపింది. ఈ వీడియోలో కేవలం 40 నిమిషాలలో 100% బ్యాటరీ ఛార్జ్ అయినట్లు చూపించింది.

 

 

WhatsAppలో ప్రొటెక్ట్ బ్యాకప్‌ ఫీచర్....WhatsAppలో ప్రొటెక్ట్ బ్యాకప్‌ ఫీచర్....

 

వీడియో

షియోమి యొక్క సహ వ్యవస్థాపకుడు లీ జున్ Weiboలో పోస్ట్ చేసిన వీడియోలో వైర్‌లెస్ ఛార్జర్‌తో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం గల Mi10 ప్రో ప్రోటోటైప్ స్మార్ట్‌ఫోన్ ఉంది. ఈ వీడియోలో ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 40 నిమిషాల్లో వైర్‌లెస్‌గా 0% నుండి 100% వరకు ఛార్జ్ చేయబడుతుంది. ఇది చాలా వేగంగా సాధించిన వైర్‌లెస్ ఛార్జింగ్ మాత్రమే కాకుండా వైర్డ్ ఛార్జింగ్ కంటే కూడా వేగంగా ఉంటుంది.

వివో సూపర్ ఫ్లాష్‌చార్జ్

వివో సూపర్ ఫ్లాష్‌చార్జ్

వివో తన 60W ‘సూపర్ ఫ్లాష్‌చార్జ్' ను అపెక్స్ 2020 కాన్సెప్ట్ ఫోన్‌లో ప్రదర్శించిన కొద్దిసేపటికే షియోమి ఈ వీడియో టీజర్ ను విడుదల చేసింది. వివో యొక్క 60W వైర్‌లెస్ ఛార్జింగ్ కేవలం 20 నిమిషాల్లో 2,000 ఎంఏహెచ్ బ్యాటరీని 0% నుండి 100% వరకు ఛార్జ్ చేసింది అని తెలిపింది.

 

 

iQOO 3: నెట్‌వర్క్‌ కనెక్టివిటీ,గేమ్ ఛేంజర్ స్మార్ట్‌ఫోన్‌లలో రారాజుiQOO 3: నెట్‌వర్క్‌ కనెక్టివిటీ,గేమ్ ఛేంజర్ స్మార్ట్‌ఫోన్‌లలో రారాజు

వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్‌

వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్‌

షియోమి తన స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టనున్నది అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. షియోమి ఇటీవలే తన ఫ్లాగ్‌షిప్ Mi10 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది కాని 30W వరకు మాత్రమే మద్దతును కలిగి ఉంటుంది. Mi 10 ప్రో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. దీనిని వైర్‌లెస్‌గా 65 నిమిషాల్లో 100% ఛార్జ్ చేయవచ్చు. వైర్డ్ ఛార్జింగ్‌లో ఇది 10W మరియు 50W వరకు రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు ఫోన్ మద్దతును ఇస్తుంది.

 

 

Tata Sky, Airtel Digital TV ఆపరేటర్ల టీవీ కనెక్షన్ కొత్త ధరలు ఇవే...Tata Sky, Airtel Digital TV ఆపరేటర్ల టీవీ కనెక్షన్ కొత్త ధరలు ఇవే...

స్మార్ట్‌ఫోన్ తయారీదారులు

స్మార్ట్‌ఫోన్ తయారీదారులు

స్మార్ట్‌ఫోన్ తయారీదారులు వైర్‌లెస్ ఛార్జింగ్‌ను వేగంగా మరియు సులభంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హువాయి, షియోమి మరియు వివో సంస్థలు అందరి కంటే ముందుండి కొత్త కొత్త ఫీచర్లను అందిస్తున్నాయి. వన్‌ప్లస్ సంస్థ కూడా ఇప్పుడు వైర్‌లెస్ పవర్ కన్సార్టియంలో చేరింది. వన్‌ప్లస్ 8 సిరీస్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని తెలిపారు. పోర్టులు లేకుండా ఫోన్ లను ఛార్జ్ చేసే ఫీచర్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు ఉండడం చాలా ముఖ్యం. పోర్ట్‌లెస్ ఫోన్ కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ తో షియోమి దానిని నిజం చేయడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Best Mobiles in India

English summary
Xiaomi Teased 40W Fast Wireless Charger

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X