షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్.. మరో రెండు రోజుల్లో

Posted By:

తన అప్‌కమింగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి గత శుక్రవారం హై రిసల్యూషన్ డిస్‌ప్లే టీజర్‌ను విడుదల చేసిన షియోమి తాజాగా మరో రెండు టీజర్లను విడుదల చేసింది. గురువారం న్యూఢిల్లీలో నిర్వహించే ‘గ్లోబల్ మై ఫోన్ ప్రీమియర్' ఈవెంట్‌లో భాగంగా షియోమి తన ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ ‘ఎమ్ఐ 4ఐ'ను ఆవిష్కరించే అవకాశం ఉంది.

 షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్.. మరో రెండు రోజుల్లో

తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి షియోమి ఇండియా విడుదల చేసిన రెండు టీజర్లలో ఒకటి బ్యాటరీ సామర్థ్యాన్ని, మరొకటి ఫోన్ నిర్మాణాన్ని సూచిస్తోంది. ఇటీవల వెబ్ ప్రపంచంలో తారస పడిన రెండు బెంచ్ మార్క్ లిస్టింగ్స్ ప్రకారం షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్ ‘ఫెరారీ' కోడ్ నేమ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు అధికారికంగా వెల్లడికావల్సి ఉంది.

 షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్.. మరో రెండు రోజుల్లో

షియోమి ‘ఎమ్ఐ 4ఐ' స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు (అనధికారికంగా)

ఆండ్రాయిడ్ 5.0.2 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 64 బిట్ 1.65గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 4.9 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 4.8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ.

English summary
Xiaomi Teases Big Battery, Premium Build Smartphone Launch on Thursday. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot