షియోమీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు.. 12GB ర్యామ్, 50MP ట్రిపుల్ కెమెరా సహా..!!
షియోమీ నుంచి భారత్ మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. షియోమీ ఇండియా ఇప్పటికే Leica తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దీంతో షియోమీ 14 సిరీస్ ( Xioami 14 Series Smartphones ) త్వరలో భారత్‌లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్లు Leica ఆధారిత కెమెరా లెన్స్‌లు కలిగి ఉంటాయని తెలుస్తోంది.
షియోమీ 14, షియోమీ 14 ప్రో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్లుగా లాంచ్ కానున్నాయి. దీంతోపాటు నాణ్యమైన ఫోటోగ్రఫీ అనుభూతిని అందించేందుకు షియోమీ 14 అల్ట్రా కూడా విడుదల అవుతుందని తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఎప్పుడు లాంచ్ కానుందనే అధికారిక సమాచారం వెల్లడికాకపోయినా.. ఫిబ్రవరిలో జరిగే MWC 2024 ఈవెంట్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

గీక్ బెంచ్, బీఐఎస్ సహా ఇతర డేటాబేస్‌లో నమోదు : షియోమీ 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్, BIS, EEC, IMEI లో ఇప్పటికే నమోదు అయింది. ఫలితంగా భారత్‌లో త్వరలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు గురించి షియోమీ అధికారికంగా వెల్లడించకపోయినా.. లీక్‌ల ఆధారంగా కొన్ని వివరాలు బయటకు వచ్చాయి.
షియోమీ 14 స్పెసిఫికేషన్లు! : షియోమీ 14 స్మార్ట్ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.36 అంగుళాల 1.5k LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్ 90W వైరడ్, 50W వైర్‌లెస్, 10W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 4610 mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని సమాచారం.
50MP ట్రిపుల్ కెమెరాలు : ఈ షియోమీ స్మార్ట్ ఫోన్ Leica బ్రాండ్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ ( OIS ) ఫీచర్‌తో కూడిన 50 MP హంటర్ 900 ప్రధాన కెమెరా, 50MP టెలీఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అలాగే సెల్పీ, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరాతో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
12GB ర్యామ్, హైపర్OS : షియోమీ 14 స్మార్ట్ ఫోన్ అండర్ ది హుడ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 12 GB ర్యామ్ మరియు 1 TB స్టోరేజీని కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు HyperOS పైన పనిచేయనుందని తెలుస్తోంది. ఇందులో కొన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications