Mi క్రెడిట్ సర్వీసును Dec 3 న ప్రారంభిస్తున్న షియోమి
షియోమి సంస్థ డిసెంబర్ 3 న ఇండియాలో పర్సనల్ లోన్స్ అందివ్వడం కోసం తన Mi క్రెడిట్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనుంది. Mi క్రెడిట్ సర్వీసును సంస్థ మొదటిసారిగా గత ఏడాది మేలో ప్రకటించారు. ఇప్పుడు చైనీస్ హ్యాండ్‌సెట్ తయారీదారు భారతీయ వినియోగదారుల కోసం క్రెడిట్ సర్వీసును పునరుద్ధరించి ఆవిష్కరించనున్నారు. Mi క్రెడిట్ లాంచ్ ముందు ఈ సర్వీస్ గురించి మరిన్ని వివరాలు తెల్సుకోవడానికి మరింత ముందుకు చదవండి.

Mi క్రెడిట్ సర్వీస్ వినియోగదారులకు ఆర్థిక రుణాలను తక్షణమే అందించే ఒక వేదికగా పనిచేస్తుంది. షియోమి సంస్థ మొదటగా ఈ సర్వీసును మే 2018 లో ప్రకటించింది. ఇందులో గుర్తుపెట్టుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం షియోమి సంస్థ వినియోగదారులకు రుణాలను అందించడం లేదు కానీ రుణాలను అందించే సర్వీసులకు వినియోగదారున్ని కేవలం లింక్ చేస్తోంది. ఈ సేవ కోసం కంపెనీ బెంగళూరు ఆధారిత స్టార్టప్ క్రెడిట్ బీతో భాగస్వామ్యం కలిగి ఉంది.

సాధారణ KYC ధృవీకరణ ప్రక్రియతో కేవలం 10 నిమిషాల్లోపు లోన్స్ అందించగలమని కంపెనీలు పేర్కొన్నాయి. వీటి ద్వారా వినియోగదారులు 100,000 రూపాయల వరకు రుణాలు పొందవచ్చు. వడ్డీ రేట్లు 1.8 శాతం నుండి ప్రారంభమవుతాయి. భాగస్వామి ప్లాట్‌ఫామ్‌లు మరియు Mi క్రెడిట్ ఏజెంట్ల ద్వారా మాత్రమే వినియోగదారుడి యొక్క సమాచారం మరియు ధృవీకరణ జరుగుతుందని షియోమి స్పష్టం చేసింది.

Mi క్రెడిట్ సర్వీస్ ఇంకా పూర్తిగా ప్రారంభించబడనప్పటికీ కొన్ని నివేదికలు ఇందులో గల సంభావ్య ప్రైవసీ సమస్యలను హైలైట్ చేస్తున్నాయి. షియోమి తన వినియోగదారుల కోసం క్రెడిట్ ప్రొఫైల్‌ను సృష్టించడానికి ఫోన్ కార్యాచరణ డేటాను ఉపయోగిస్తుందని ఈ నివేదికలు పేర్కొన్నాయి. డేటా సేకరణలో "ఐడెంటిటీ, లైఫ్ స్టేజ్(ఏజ్) , జీవనశైలి, సోషల్ రిలేషన్స్ మరియు బ్రాండ్ లాయల్టీ వంటివి ఉన్నాయి.

Mi క్రెడిట్ సర్వీస్ కోసం సైన్ అప్ చేసే వినియోగదారులు వారి వ్యక్తిగత డేటాను ‘ప్రొఫెషనల్ మరియు విద్యా నేపథ్యాలు', ‘తాత్కాలిక మెసేజ్ హిస్టరీ' వంటి మరిన్నిటిని పంచుకోవలసి ఉంటుంది. వినియోగదారులు "కొన్ని యాప్ లు మరియు వెబ్‌సైట్‌ల వాడకానికి" సంబంధించిన సమాచారాన్ని కూడా పంచుకోవలసి ఉంటుంది. వినియోగదారులు తమ డేటాను మూడవ పార్టీ సర్వీస్ ప్రదాతలతో పంచుకోవటానికి అంగీకరించాలి అన్న ఒప్పందంపై సంతకం చేయవలసి ఉంటుంది. క్రెడిట్ స్కోరింగ్‌కు సంబంధించిన విధానంలో భాగంగా ప్రమోషన్ లేదా విడాకులు వంటి జీవనశైలి మార్పులను కూడా సంస్థ ట్రాక్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








