అక్టోబర్ 9న ఇండియా మార్కెట్లోకి రెడ్‌మి 8

By Gizbot Bureau
|

చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమి ఇండియాలోని అభిమానులక శుభవార్తను అందించింది. దీపావళికన్నా ముందే తన కొత్త ఫోన్ రెడ్‌మి 8ను ఇండియా మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఇప్పటికే ఇండియాకు రెడ్‌మి 8 సిరీస్‌ను పరిచయం చేసింది. షియోమి కొద్దిరోజుల క్రితమే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 8ఏ రిలీజ్ చేసింది ఈ శుభవార్త అలా ఉండగానే దసరా మరుసటి రోజు అక్టోబర్ 9న రెడ్‌మి 8 రిలీజ్ చేయబోతున్నట్టు ట్విట్టర్‌లో ప్రకటించింది. టీజర్‌లో కనిపించే ఇమేజ్‌ను బట్టి చూస్తే షియోమి రిలీజ్ చేయబోయేది రెడ్‌మీ 8 అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్లు బీజింగ్ లో లాంచ్ అయ్యాయి. రెడ్‌మి నోట్‌ 8 సిరీస్‌లో రెడ్‌మి నోట్‌ 8, రెడ్‌ మి నోట్‌ 8 ప్రొ పేరుతో చైనా మార్కెట్లోకి వీటిని తీసుకువచ్చింది. కాగా రెడ్‌మి 8లో అది పెద్ద బ్యాటరీ మరియు మంచి కెమెరాలు ఉంటనున్నట్లు సమాచారం.

రెడ్‌మి నోట్‌ 8 ఫీచర్లు ( అంచనా)
 

రెడ్‌మి నోట్‌ 8 ఫీచర్లు ( అంచనా)

6.39 అంగుళాల డిస్‌ప్లే, 1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, ఆండ్రాయిడ్‌ 9 పై, క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 665 సాక్‌, 4 జీబీ ర్యామ్‌ , 64 జీబీ స్టోరేజ్‌, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, 48+ 8 + 2 +2 ఎంపీ రియర్‌ క్వాడ్‌ కెమెరా, 4000ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఇండియాలో ధర సుమారుగా..

4జీబీ/64జీబీ ధర రూ.10,000, 6జీబీ/64జీబీ ధర రూ.12,000, 6జీబీ/128జీబీ ధర రూ.14,000

రెడ్‌మినో ట్ 8 ప్రో ఫీచర్లు ( అంచనా)

రెడ్‌మినో ట్ 8 ప్రో ఫీచర్లు ( అంచనా)

6.53 అంగుళాల డిస్‌ప్లే, 1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, మీడియా టెక్‌ హీలియో ప్రాసెసర్‌ జీ90టీ, ఆండ్రాయిడ్‌ 9 పై, 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ,20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 64+8+2+2 ఎంపీ క్వాడ్‌ రియర్‌ కెమెరా, 4500ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఇండియాలో ధరలు సుమారుగా

6జీబీ/64జీబీ ధర రూ.14,000, 6జీబీ/128జీబీ ధర రూ.16,000, 8జీబీ/128జీబీ ధర రూ.18,000

రెడ్‌మీ 8 ఏ ఫీచర్లు

రెడ్‌మీ 8 ఏ ఫీచర్లు

6.22 ఎల్‌సీడీ డిస్‌ప్లే,1520×720 పిక్సెల్స్‌రిజల్యూషన్‌,ఆండ్రాయిడ్‌ 9పై , 19:9 రేషియే వాటర్‌డ్రాప్‌ నాచ్‌ కార్నింగ్‌గ్లాస్‌ ,క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌ 439, 2/3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ ,12 ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ ఏఐబ్యూటీ సెల్పీకెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

దీని ప్రారంభ ధర రూ. 6499.3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ ధర 6,999

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi to launch Redmi 8 in India on October 9: Here's what we know so far

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X