Redmi Note 12 సిరీస్ ఇండియా లాంచ్ డేట్ ప్రకటించారు! స్పెసిఫికేషన్లు

By Maheswara
|
Xiaomi to unveil the SuperNote Redmi Note 12 5G series in India on January 5

రెడ్‌మి నోట్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల మార్కును అధిగమించిందని, ఇది అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ ఫోన్ సిరీస్‌లలో ఒకటిగా మారిందని షియోమి ఇండియా ఇటీవల ప్రకటించింది. ఈ సంఖ్యలో, 72 మిలియన్లు భారతదేశంలోనే విక్రయించబడ్డాయి. భారతదేశంలో అత్యంత ప్రశంసలు పొందిన మరియు అత్యంత ప్రజాదరణ పొందిన ఈ రెడ్ మీ నోట్ సిరీస్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, Xiaomi తన తాజా Redmi Note 12 సిరీస్‌ను జనవరి 5, 2023న విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది 'SuperNote' సిరీస్ ఫీచర్ ఉంటుందని బ్రాండ్ అధికారికంగా ప్రకటించింది. భారతదేశంలో ఈ సిరీస్ లో మూడు మోడల్స్: Redmi Note 12 5G, Redmi Note 12 Pro 5G మరియు Redmi Note 12 Pro+ 5G ఫోన్లు ఉంటాయి.

ఈ కొత్త రెడ్‌మి నోట్ హార్డ్‌వేర్ విభాగంలో గణనీయమైన అప్‌గ్రేడ్‌లను తీసుకువచ్చినప్పటికీ, రెడ్‌మి నోట్ 12 సిరీస్‌లోని క్లాసిక్ వేరియంట్ 5 జి కనెక్టివిటీకి మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇంకా, ఇది 120Hz AMOLED డిస్ప్లే మరియు స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ యొక్క పవర్-ప్యాక్డ్ కాంబోని కలిగి ఉంటుంది. Redmi Note 12 Pro ఫోన్ Sony IMX 766 సెన్సార్‌ను కలిగి ఉన్న సూపర్ OIS కెమెరా ని పొందుతుంది మరియు Redmi Note 12 Pro+ 5G 200MP కెమెరా సెటప్‌తో శామ్‌సంగ్‌తో సహ-అభివృద్ధి చేసిన HPX సెన్సార్‌ను భారతదేశానికి పరిచయం చేస్తుంది. వీటి గురించి, వివరణాత్మక స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు అధికారిక అమెజాన్ ఇండియా ఉత్పత్తి పేజీలో అందుబాటులో ఉన్నాయి తెలుసుకోండి.

Redmi Note 12 5G స్పెసిఫికేషన్ల వివరాలు

Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ Note 12 డ్యూయల్ 5G బ్యాండ్ సపోర్ట్‌తో పాటు సున్నితమైన పనితీరు కోసం క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీ మరియు 33W ఇన్-బాక్స్ ఫాస్ట్ ఛార్జర్‌తో మద్దతు ఇస్తుంది.

దాని గ్లోబల్ వేరియంట్‌కు వేరుగా, ఇది ట్రిపుల్ కెమెరా సెటప్‌తో 48MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8MP అల్ట్రావైడ్ మరియు 2MP మాక్రో సెన్సార్‌తో వస్తుంది. ముందు భాగంలో, వినియోగదారు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

Redmi Note 12 Pro 5G స్పెసిఫికేషన్ల వివరాలు

Xiaomi to unveil the SuperNote Redmi Note 12 5G series in India on January 5

Redmi Note 12 Pro స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ మరియు 67W ఫాస్ట్ ఛార్జర్‌తో పాటు 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో, 50MP సోనీ IMX766 ప్రైమరీ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), 8MP అల్ట్రావైడ్ షూటర్ మరియు 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంది. ఇంకా, Redmi Note 12 Pro 5G స్మార్ట్‌ఫోన్ సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ను కలిగి ఉంటుంది.

Redmi Note 12 Pro ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.67-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో డిస్‌ప్లే మెరుగైన వీక్షణ అనుభవం కోసం డాల్బీ విజన్ & డాల్బీ అట్మాస్ సర్టిఫికేషన్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

Redmi Note 12 Pro+ 5G స్పెసిఫికేషన్ల వివరాలు

Xiaomi to unveil the SuperNote Redmi Note 12 5G series in India on January 5

Redmi Note 12 Pro+ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.67-అంగుళాల 10-బిట్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ప్యానెల్ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది మరియు డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ అలాగే HDR10+కి మద్దతు ఇస్తుంది. OISతో 200-మెగాపిక్సెల్ Samsung HPX ప్రైమరీ సెన్సార్‌తో వచ్చే భారతదేశపు మొదటి ఫోన్. వేగవంతమైన మరియు మృదువైన పనితీరును అందచేయడం కోసం ఈ ఫోన్లో కూడా మీడియా టెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అలాగే, బాక్స్‌లో 120W హైపర్‌ఛార్జ్‌తో కూడిన భారీ 4980mAh బ్యాటరీ ఉంది, ఇది దాదాపు 19 నిమిషాల్లో బ్యాటరీ యూనిట్‌లో సున్నా నుండి 100 శాతానికి ఛార్జ్ చేస్తుందని ఈ బ్రాండ్ పేర్కొంది.

ఈ ఫోన్ యొక్క ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే, ఈ బ్రాండ్ రెడ్‌మి నోట్ 12 ప్రో+ ని భారతదేశంలో దాదాపు రూ. 30,000 కి లాంచ్ చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా, Redmi Note 12 Pro ధర రూ. 25,000, మరియు Redmi Note 12 ధర రూ. 20,000 లోపు ఉంటే భారతదేశంలో అద్భుతమైన ఆఫర్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ల యొక్క మరింత సమాచారం కోసం, అధికారిక అమెజాన్ ఇండియా పేజీ ని చూడండి.

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi to unveil the 'SuperNote' Redmi Note 12 5G series in India on January 5

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X