ఇండియాలో షియోమి సంచలనం, అనూహ్యంగా తెరపైకి జియో

|

దేశీయ మొబైల్ మార్కెట్ రోజురోజు అనేక సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతోంది. షియోమి తన దూకుడును ఏ మాత్రం ఆపడం లేదు. మొత్తంగా ఇండియా మొబైల్ మార్కెట్‌ని చైనా దిగ్గజం షియోమి శాసిస్తోంది. ఎన్నో ఏళ్లపాటు ఎదురులేకుండా దూసుకెళ్లిన శాంసంగ్ ను కిందకు నెట్టివేస్తూ అగ్రభాగాన నిలిచింది. 2018 తొలి త్రైమాసికంలో 30.3 శాతం వాటాతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. 25.1 శాతం వాటాతో శాంసంగ్ రెండవ స్థానానికి పరిమితం కాగా ... 7.4 శాతం వాటాతో ఒప్పో మూడో స్థానంలో, 6.7 శాతంతో వివో 4 వ స్థానంలో నిలిచింది. ట్రాన్సిషన్ గ్రూప్ 4.6 శాతం వాటాతో 5 వ స్థానం సొంతం చేసుకుంది.

 

స్టన్నింగ్ ఫీచర్లతో అతి త్వరలో రానున్న 7 స్మార్ట్‌ఫోన్లుస్టన్నింగ్ ఫీచర్లతో అతి త్వరలో రానున్న 7 స్మార్ట్‌ఫోన్లు

 4 జీ ఫీచర్ ఫోన్ మార్కెట్లో..

4 జీ ఫీచర్ ఫోన్ మార్కెట్లో..

ఐటిల్, టెక్నో, ఇన్ఫినిక్స్, స్పైస్ అనే నాలుగు బ్రాండ్లు ఉన్నాయి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడిసి) నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. త్రైమాసికం పరంగా చూస్తే 4 జీ ఫీచర్ ఫోన్ మార్కెట్లో 50 శాతానికి పైకి వృద్ధి నమోదైంది. దీనికి రిలయన్స్ జియోఫోన్ ప్రధాన కారణం.

జియో 38.4 శాతం మార్కెట్ వాటాతో .

జియో 38.4 శాతం మార్కెట్ వాటాతో .

ఫీచర్ ఫోన్ మార్కెట్లో జియో 38.4 శాతం మార్కెట్ వాటాతో టాప్ లో ఉంది. దీని తరువాత స్థానంలో శాంసంగ్ (10.4 శాతం), ట్రాన్స్నిషన్ (7.9 శాతం), లావా (6 శాతం), మైక్రోమాక్స్ (4.7 శాతం) ఉన్నాయి. 2018 తొలి త్రైమాసికంలో (జనవరి-మార్చి) దేశంలో స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 3 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన 11 శాతం వృద్ధి నమోదయ్యింది.

షియోమి విజయానికి అనేక కారణాలు..
 

షియోమి విజయానికి అనేక కారణాలు..

ఇండియా మార్కెట్లో పాగా వేసిన షియోమి విజయానికి అనేక కారణాలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు.వాటిని ఓ సారి పరిశీలిస్తే..

1. షియోమి తన ఫోన్లను కేవలం ఆన్ లైన్ మార్కెట్ ద్వారానే అమ్ముతోంది. దీనికోసం ఎటువంటి మార్కెటింగ్ కాని డీలర్స్ కు కాని అవకాశం ఇవ్వడం లేదు. అందువల్ల కంపెనీకి డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన ఖర్చులు పూర్తి స్తాయిలో సేవ్ అయినట్లే..ఇదొక మార్కెట్ సూత్రం.

Cost cutting

Cost cutting

షియోమి తన ఫోన్ల కోసం ఎటువంటి యాడ్స్ కాని అలాగే దానికి సంబంధించిన ట్రేడిషనల్ అడ్వర్టేజ్ మెంట్లు కాని ఇవ్వదు. మిగతా కంపెనీలు మాత్రం తమ ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే భారీగా దానికి అడ్వర్టేజ్ మెంట్ కల్పిస్తారు. దీనికి బోలెడంత ఖర్చు కూడా పెడతారు. అయితే ఈ విషయంలో షియోమి బిజినెస్ మైండ్ చాలా వేరనే చెప్పుకోవాలి. కేవలం సోషల్ మీడియా ద్వారానే షియోమి తన ఫోన్లకు ప్రచారం కల్పించుకుంటూ కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

Limited quantities

Limited quantities

షియోమి మార్కెట్లోకి ఫోన్ వదిలే సమయంలో Limited quantities సూత్రాన్ని అవలంభిస్తుంది. కొత్త ఫోన్ మార్కెట్లోకి వదిలేముందు పరిమిత సంఖ్యలో మాత్రమే యూనిట్లను తయారుచేసి వదులుతుంది. అదే ఇతర కంపెనీలు అమ్మకాలు సంగతి అటుంచి ఎక్కువ సంఖ్యలో ఫోన్లను ఉత్పత్తి చేస్తుంటాయి. అవి అమ్మకాలు జరపకపోతే భారీగా నష్టపోతుంటాయి. షియోమి ఇందుకు పూర్తిగా విరుద్ధం. డిమాండును బట్టి యూనిట్లను తయారుచేస్తుంది.

A Kindle-like business model

A Kindle-like business model

షియోమి కేవలం మొబైళ్లను మాత్రమే కాకుండా దానికి సంబంధించిన హార్డే‌వేర్, సాఫ్ట్‌వేర్ పార్టులను విక్రయిస్తుంది. తద్వారా కంపెనీ భారీ ఆదాయాలను కొల్లగొడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

International expansion

International expansion

ప్రపంచవ్యాప్తంగా షియోమి ఇదే బిజినెస్ ఫాలో అవుతూ ముందుకు వెళుతోంది. అయితే కొన్ని కంపెనీలు ఒక్కో దేశంలో ఒక్కో విధమైన విధానంతో ఫాలో అవుతున్నారు. అది ఒక్కోసారి ఫెయిల్యూర్ అయి మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఉన్నాయని షియోమికి అటువంటి సమస్య లేదని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తయారీ ఖర్చు

తయారీ ఖర్చు

చైనా అంటేనే లేబర్స్ కి పెట్టింది. పేరు. అక్కడ శ్రమదోపిడి ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. మొబైల్ కి సంబంధించి అన్ని రకాల పార్టులను చైనాలో తయారుచేస్తూ ఉంటారు. ఇది కూడా షియోమికి బాగా కలిసివస్తోంది.

ఫ్లాష్ సేల్ లెక్కల్లో నిజమెంత ?

ఫ్లాష్ సేల్ లెక్కల్లో నిజమెంత ?

షియోమి తన కంపెనీ నుంచి వచ్చిన ఏ ఫోన్ అయినా ఫ్లాష్ సేల్ ద్వారానే ప్రారంభిస్తుంది. అంటే వినియోగదారుడు నేరుగా కొనుక్కునే పరిస్థితి ఉండదు. షియోమి కంపెనీ ఏ టైంలో ఫ్లాష్ సేల్ పెడితే ఆ సమయానికి రెడీ కావాలని చెబుతూ ఉంటుంది. అయితే ఈ ఫ్లాష్ సేల్ కోసం అందరూ ఊపిరి బిగపట్టుకుని ఎదురుచూస్తుంటారు. ఫ్లాష్ సేల్ప ప్రారంభం కాగానే యూజరు సెలక్ట్ చేసుకునే లోపు అది అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది.

చాలా తక్కువ స్థాయిలో ఫోన్లను ..

చాలా తక్కువ స్థాయిలో ఫోన్లను ..

దీనికి ప్రధాన కారణం కంపెనీ చాలా తక్కువ స్థాయిలో ఫోన్లను ఫ్లాష్ సేల్ కింద పెడుతుంది. అయితే లక్షల్లో ఫోన్లు పెట్టామని తరువాత స్టేట్ మెంట్లు ఇస్తుంది. ఫ్లాష్ సేల్ లో మేము ఇన్ని ఫోన్లు పెడుతున్నామని నంబరు ఎక్కడా ప్రకటించదు. అలా ప్రకటిస్తే కంపెనీ మార్కెటింగ్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

నిమిషాల వ్యవధిలో అన్ని లక్షల ఫోన్లు అమ్ముడుపోవడం సాధ్యమేనా..

నిమిషాల వ్యవధిలో అన్ని లక్షల ఫోన్లు అమ్ముడుపోవడం సాధ్యమేనా..

తరువాత కంపెనీ లక్షల సంఖ్యలో ఫోన్లు అమ్ముడుపోయాయని ఇది షియోమి ఘన విజయం అని గొప్పలకు పోతుంది. అయితే కేవలం నిమిషాల వ్యవధిలో అన్ని లక్షల ఫోన్లు అమ్ముడుపోవడం సాధ్యమేనా అనే సందేహం చాలామందికి వస్తుంది. ఈ విషయంపై షియోమి చాలా తెలివిగా వ్యవహరిస్తుందని అర్థమవుతుంది. అంత తక్కువ టైంలో ఫోన్లు అమ్ముడుపోయాయంటే దానికి ఇంకా క్రేజ్ పెరిగి యూజర్లు మళ్లీ ప్లాష్ సేల్ కి రెడీ అవుతారని షియోమి నమ్మకం.

షియోమి ఆప్ లైన్ స్టోర్లను..

షియోమి ఆప్ లైన్ స్టోర్లను..

ఇక షియోమి ఆప్ లైన్ స్టోర్లను అసలు ముట్టుకోదు. కేవలం షియోమి సైట్లో మాత్రమే కొనమని చెబుతుంది. మరి ఫ్లాష్ సేల్ లో ఫోన్ సొంతం చేసుకోలేని వారు ఏం చేస్తారు. ఆఫ్ లైన్ స్టోర్ వైపు చూస్తారు. ఆఫ్ లైన్ స్టోర్ యజమానులు షియోమి ఫోన్లను బుక్ చేసి దాన్ని ఎక్కువ ధరకు అమ్మి ప్రయోజనం పొందుతారు. ఈ విషయాలను మాత్రం షియోమి అసలు పట్టించుకోదు.

వారంటీ విషయంలోషియోమి చాలా పూర్ ..

వారంటీ విషయంలోషియోమి చాలా పూర్ ..

వారంటీ విషయంలోషియోమి చాలా పూర్ అనే చెప్పాలి. ఆ కంపెనీ ఆధరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్లు దేశంలో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కొన్ని చోట్లు అసలు లేనే లేవు..ఇలా లేని చోట్ల మూడో పార్టీకి షియోమి సర్వీసును అప్పగించడంతో షియోమి యూజర్లు కొంచెం నిరాశకు గురిఅవుతున్నారు. షియోమి ఫోన్లకు సంబంధించిన మెటీరియల్ దొరకడం లేదని వారంటీ ఇవ్వడం లేదని యూజర్లు చాలా చోట్ల కంప్లయిట్లు చేస్తున్నారు.

ఫోన్లో ఏదైనా సమస్య వస్తే

ఫోన్లో ఏదైనా సమస్య వస్తే

ఇక షియోమి ఫోన్లో ఏదైనా సమస్య వస్తే ఇక అంతే సంగతులు. దానికి సంబంధించిన అసలైన పార్టులు కొన్ని చోట్ల అసలు దొరకవు. వేరే కంపెనీల పార్టులు వేసినా అది కొన్ని రోజులకు సతాయించడం మళ్లీ సమస్యలు రావడం షరా మాములేనని ఈ విషయంలో షియోమి బాగా వెనుకపడిందని యూజర్లు చెబుతున్నారు.

అప్పుడప్పుడు రూపాయి సేల్..

అప్పుడప్పుడు రూపాయి సేల్..

ఇక షియోమి అప్పుడప్పుడు రూపాయి సేల్ పెడుతుంది. మరి ఈ సేల్ కింద యూజర్లు ఎవరైనా ఫోన్ సొంతం చేసుకున్నారా అనేది కూడా సందేహాస్పదమే..క్షణాల్లో అవుట్ ఆఫ్ స్టాక్ అంటూ దర్శనమిస్తుంది. తరువాత నోటిఫై అనే ఆప్సన్ కనిపిస్తుంది. మళ్లీ ఫోన్ కోసం ప్రయత్నించాని సేమ్ సీన్ రిపీట్ అవుతూ వస్తూ ఉంటుంది.

Best Mobiles in India

English summary
Xiaomi tops smartphone market, Jio leads 4G handset segment in India: IDC More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X