స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు నమోదు చేసిన చైనా కంపెనీ షియోమి ఇప్పుడ సరికొత్తగా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. భారత్‌లో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు భారీగానే కసరత్తులు చేస్తోందని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొబైల్ మార్కెట్ నుంచి ఇతర మార్కెట్లోకి తన సేవలను విస్తరించేందుకు పావులు కదుపుతోందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది.
4,000mAh, సెల్ఫీ ప్లాష్ స్మార్ట్‌ఫోన్ రూ. 6,999కే
మన దేశంలో ఎలక్ట్రిక్ కార్లను..
ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయం, పేమెంట్ బ్యాంక్ సేవలను ప్రారంభించడానికి యోచిస్తోందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. ఈ కంపెనీ మన దేశంలో ఎలక్ట్రిక్ కార్లను కూడా విక్రయించనున్నట్టు తెలిసింది. కేవలం కార్లే కాకుండా వాటి విడి భాగాలను కూడా విక్రయించాలని షియోమీ చూస్తున్నదట.
కార్లు విక్రయాలతో పాటు రుణాలు
ఈ నేపథ్యంలోనే త్వరలోనే కార్లు విక్రయాలతో పాటు రుణాలు ఇవ్వడం లాంటి ఇతర ఫైనాన్సింగ్ సేవలను అందించనుందనీ ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫైలింగ్‌లో తెలిపిందని ఎకనామిక్స్ టైమ్స్ పేర్కొంది.
షియోమి దాఖలు చేసిన వివరాల ప్రకారం..
ఆర్‌ఓసీలో షియోమి దాఖలు చేసిన వివరాల ప్రకారం, అన్ని రకాల వాహానాలు (ఎలక్ట్రికల్ వాహనాలతో సహా) రవాణ పరికరాలు, ఇతర రవాణా సామగ్రి, విడిభాగాలను సరఫరా చేయనున్నామని ప్రకటించింది.
మొబైల్ వర్చ్యువల్ నెట్‌వర్క్ ఆపరేటర్ల వ్యాపారంలోకి ..
అంతేకాదు నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, పేమెంట్ బ్యాంకు, లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్, ఇతర ఆర్థిక సేవలు, పేమెంట్ గేట్ వే, సెటిల్మెంట్ సిస్టమ్ ఆపరేటర్లు, మొబైల్ వర్చ్యువల్ నెట్‌వర్క్ ఆపరేటర్ల వ్యాపారంలోకి ప్రవేశించాలని భావిస్తున్నట్టు సంస్థ తెలిపింది.
చైనాలో ఎలక్ట్రిక్ బైక్‌లు, సైకిళ్లను ..
ఇప్పటికే షియోమీ చైనాలో ఎలక్ట్రిక్ బైక్‌లు, సైకిళ్లను విక్రయిస్తున్నది. ఈ క్రమంలోనే త్వరలో ఎలక్ట్రిక్ కార్లను కూడా అందుబాటులోకి తేవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.