షియోమీ X ప్రో QLED (2025) సిరీస్ స్మార్ట్‌టీవీలు విడుదల.. ఫీచర్‌లు. ధర వివరాలు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌టీవీ, గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ షియోమీ భారత్ మార్కెట్ లో ఇవాళ షియోమీ X ప్రో QLED (2025) సిరీస్ స్మార్ట్‌టీవీలను (Xiaomi X pro QLED 2025 series) విడుదల చేసింది. ఈ టీవీలు మొత్తంగా మూడు వేరియంట్స్ లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి Vivid పిక్చర్ ఇంజిన్, డాల్బీ విజన్, HDR10+ సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ లైనప్ 4k రిజల్యూషన్‌తో QLED డిస్‌ప్లేను కలిగి ఉంది.
షియోమీ X ప్రో QLED (2025) సిరీస్ పూర్తి వివరాలు :
షియోమీ X ప్రో QLED (2025) సిరీస్ 43 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్స్‌లో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌తో 4K రిజల్యూషన్, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్‌ను కలిగి ఉంది.

షియోమీ X ప్రో QLED (2025) సిరీస్ స్మార్ట్ టీవీలు క్వాడ్ కోర్ A55 చిప్, Mali G52 MC1 GPU చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. ఈ మోడల్స్ 2GB ర్యామ్, 32GB స్టోరేజీని కలిగి ఉంటాయి. ఈ మోడల్స్ patchwall UI తో కూడిన గూగుల్ టీవీ పైన పనిచేస్తాయి.
ఈ షియోమీ స్మార్ట్‌టీవీ డిస్‌ప్లే HDR10+, డాల్బీ విజన్ ను సపోర్టు చేస్తుంది. Vivid పిక్చర్ ఇంజిన్ 2 టెక్నాలజీ, DLG టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టీవీలు వైబ్రంట్, true to life కలర్స్ అనుభూతి కోసం MagiQ ఫీచర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌టీవీ ఫిల్మ్ మేకర్ మోడ్‌ను కూడా కలిగి ఉంది.
షియోమీ స్మార్ట్‌టీవీ 43 అంగుళాల టీవీ 30W స్పీకర్‌లను కలిగి ఉంది. అదే మిగిలిన రెండు వేరియంట్స్ 34W ఆడియో అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. ఈ మోడల్స్ డాల్బీ ఆడియో, DTS:X, DTS వర్చువల్: X, షియోమీ సౌండ్ ను సపోర్టు చేస్తుంది.

ఈ మూడు మోడల్స్ షియోమీ TV+ ను సపోర్టు చేస్తాయి. దీని ద్వారా లైవ్ ఛానల్స్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. ఈ మోడల్స్ ఆపిల్ ఎయిర్‌ప్లే2, ఇన్‌బిల్ట్ గూగుల్ క్రోమ్‌కాస్ట్, Miracast సపోర్టు చేస్తాయి. స్మార్ట్ టీవీని కంట్రోల్ చేసేందుకు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. దీంతోపాటు కిడ్స్ మోడ్, పేరెంట్ లాక్ ఫీచర్ కూడా ఉన్నాయి.
ఈ షియోమీ స్మార్ట్‌టీవీలు బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ వైఫై కనెక్టివిటీని కలిగి ఉన్నాయి. షియోమీ X ప్రో QLED (2025) సిరీస్ eARC సపోర్టు కోసం HDMI, USB 2.0 పోర్టులు, ఎథర్‌నెట్ పోర్టులున్నాయి. దీంతోపాటు AV కనెక్టర్, యాంటెనా ఇన్‌పుట్ కూడా కలిగి ఉంది.
షియోమీ X ప్రో QLED (2025) సిరీస్ ధర, సేల్ వివరాలు :
షియోమీ X ప్రో QLED (2025) సిరీస్ 43 అంగుళాల స్క్రీన్ మోడల్ ధర రూ.31,999 గా ఉంది. అదే 55 అంగుళాల టీవీ రూ.44,999, 65 అంగుళాల టీవీ మోడల్ ధర రూ.64,999 గా ఉంది. ఏప్రిల్ 16 న తేదీ నుంచి ఈ టీవీల సేల్ ప్రారంభం కానుంది. షియోమీ ఇండియా రిటైల్ స్టోర్, Mi.com, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








