రూ.4999కే Xolo Era 3 స్మార్ట్‌ఫోన్, 3జీబి ర్యామ్.. 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ Xolo తన Era సిరీస్ నుంచి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను
మార్కెట్లో లాంచ్ చేసింది. Era 3X, Era 2V, Era 3 మోడల్స్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. ఎరా 3ఎక్స్ మోడల్ ధర రూ.7,499, ఎరా 2వీ మోడల్ దర రూ.6.499, ఎరా 3 మోడల్ ధర రూ.4,999. ఈ మూడు సెల్ఫీ-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.

ప్రీ-ఆర్డర్స్ ఇప్పటికే మొదలయ్యాయి. సేల్ అక్టోబర్ 14 నుంచి ప్రారంభమవుతుంది. బ్లాక్ ఇంకా గ్రే కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లను ఎంపిక చేసుకోవచ్చు. మూన్‌లైట్ ఫ్రంట్ ఫ్లాష్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా తక్కువ వెళుతురు కండీషన్స్‌లోనూ హై-క్వాలిటీ సెల్ఫీలను చిత్రీకరించుకునే వీలుంటుందని కంపెనీ చెబుతోంది.

Xolo Era 3X స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు...
5 ఇంచ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్ అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 64-బిట్ క్వాడ్ కోర్ మీడియాటెక్ MT6737 ప్రాసెసర్, మాలీ టీ720 జీపీయూ, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా విత్ మూన్‌లైట్ ఫ్రంట్‌ఫ్లాష్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3,000mAh బ్యాటరీ, 4G VoLTE సపోర్ట్.

Xolo Era 2V స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు...
5 ఇంచ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1280×720 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 64-బిట్ క్వాడ్ కోర్ మీడియాటెక్ MT6737 ప్రాసెసర్, మాలీ టీ720 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా విత్ మూన్‌లైట్ ఫ్రంట్‌ఫ్లాష్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4G VoLTE సపోర్ట్. డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.
Xolo Era 3 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు...
5 ఇంచ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ మూన్‌లైట్ ఫ్రంట్‌ఫ్లాష్ సపోర్ట్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్. డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.
కొత్తగా లాంచ్ చేసిన ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌ల పై ఏడాది పాటు వన్-టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్ గ్యారంటీని జోలో అందిస్తోంది. ఈ ఫోన్‌లను లాంచ్ చేసిన అనంతరం జోలో ఇండియా బిజినెస్ మెడ్ సునీల్ రైనా మాట్లాడుతూ తమ సరికొత్త Era సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఆధునిక స్మార్ట్ కమ్యూనికేషన్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత సుఖమయం చేస్తాయని అన్నారు.


Click it and Unblock the Notifications








