Home
News

30W ఆడియో, ఇన్‌బిల్ట్‌ గూగుల్‌ టీవీ, 200 అంగుళాల వరకు ప్రొజెక్షన్‌తో.. స్మార్ట్‌ ప్రాజెక్టర్ విడుదల..!

Yaber K3 Smart Projector : భారత్‌లో స్మార్ట్‌ ప్రొజెక్టర్‌లకు డిమాండ్‌ అధికంగా ఉంటోంది. ఫలితంగా అనేక సంస్థలు వివిధ ధరల సెగ్మెంట్‌ లో ప్రొజెక్టర్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. తాజాగా యాబర్‌ సంస్థ స్మార్ట్‌ ప్రొజెక్టర్‌ను భారత్‌ మార్కెట్‌లో విడుదల చేసింది. యాబెర్‌ K3 పేరుతో ప్రాజెక్టర్‌ను లాంచ్‌ చేసింది. ఇన్‌డోర్‌, అవుట్‌డోర్‌ లోనూ మెరుగైన పనితీరు కనబరుస్తుందని చెబుతోంది. మరియు 30W ఆడియో అవుట్‌పుట్‌, డాల్బీ ఆడియో, JBL స్పీకర్లను కలిగి ఉంటుంది.

అడ్వాన్స్‌డ్‌ ఫీచర్‌లు :
యాబెర్‌ K3 స్మార్ట్‌ ప్రొజెక్టర్‌ అడ్వాన్స్‌డ్‌ LED మరియు NovaGlow ఆప్టికల్‌ టెక్నాలజీతో కూడిన 1600 ANSI లూమిన్స్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుంది. యాంబియంట్‌ లైట్‌ ను 30 శాతం వరకు తగ్గిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టర్‌ లో మరో ఆకట్టుకొనే ఫీచర్‌ కూడా ఉంది.

Yaber K3 Smart Projector launched

200 అంగుళాల డిస్‌ప్లే సైజు వరకు :
యాబెర్‌ K3 స్మార్ట్‌ ప్రాజెక్టర్‌ లో ఫోటోలను 40 నుంచి 200 అంగుళాల వరకు ప్రొజెక్ట్‌ చేస్తుంది. 1080P రిజల్యూషన్‌ ను కలిగి ఉంది. ఆటో ఫోకస్‌ ఫీచర్‌ తో అందుబాటులో ఉంది. ఎటువంటి అడ్డంకులు ఉన్నా.. స్క్రీన్‌ ను ఆటోమేటిక్‌గా ప్రొజెక్షన్‌కు సిద్ధం చేస్తుంది.

ఇన్‌బిల్ట్‌ గూగుల్‌ టీవీ :
K3 స్మార్ట్‌ ప్రాజెక్టర్‌ లో మరో ఆకట్టుకొనే ఫీచర్‌ ఉంది. ఈ ప్రాజెక్టర్‌ ఇన్‌బిల్ట్‌ గూగుల్ టీవీ ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్‌, జియోహాట్‌స్టార్‌, ప్రైమ్‌ వీడియో వంటి ఓటీటీ యాప్‌లు సహా మొత్తంగా 7000 యాప్స్‌ ను సపోర్టు చేస్తుంది.

మెరుగైన ఆడియో కోసం ఈ K3 ప్రొజెక్టర్‌ JBL, డాల్బీ ఆడియోతో కూడిన 30W స్పీకర్లను కలిగి ఉంది. ఫలితంగా ఇన్‌డోర్‌, అవుట్‌డోర్‌ లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా వినియోగించుకోవచ్చు. ఈ ప్రాజెక్టర్‌ MP3, AAC, APE, LPCM, FLAC, OGG, AMR వంటి ఫార్మాట్‌లను సపోర్టు చేస్తుంది.

Yaber K3 Smart Projector launched

ఈ ప్రాజెక్టర్‌ను అమెజాన్‌ అలెక్సా, గూగుల్‌ అసిస్టెంట్‌ ద్వారా కూడా నియంత్రించవచ్చు. కనెక్టివిటీ పరంగా ఈ ప్రాజెక్టర్‌ బ్లూటూత్‌ 5.0, వైఫై 6, NFC స్క్రీన్‌కాస్ట్‌ ఫీచర్‌లు ఉన్నాయి. మరియు 2 HDMI, Ethernet, USB పోర్టులను కలిగి ఉంది. ఇన్‌బిల్ట్‌ టీవీ డాంగిల్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.

భారత్‌ మార్కెట్‌లో ఈ యాబర్‌ K3 స్మార్ట్‌ ప్రొజెక్టర్‌ ధర రూ.59900 గా ఉంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఈ ప్రొజెక్టర్‌ను అమెజాన్‌లో రూ.42990 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్‌ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుందో వెల్లడి కాలేదు. మొత్తంగా 2 కేజీల బరువును కలిగి ఉంది.

ఈ ప్రాజెక్టర్‌ 1600 లూమిన్స్ బ్రైట్‌నెస్‌తోపాటు గరిష్ఠంగా 200 అంగుళాల డిస్‌ప్లే సైజు వరకు ప్రొజెక్షన్‌కు అవకాశం ఉంది. మరియు ఇన్‌బిల్ట్‌ గూగుల్‌ టీవీని సపోర్టు చేస్తుంది. దీంతోపాటు 30W ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తుంది. వాయిస్‌ కమాండ్స్‌ ద్వారా కూడా నియంత్రించవచ్చు.

Best Mobiles in India

English summary
Yaber K3 Smart Projector launched in india with maximum 200 inch projection
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X