జీమెయిల్ అంతరాయం ట్వీట్ పై గూగుల్‌కు యాహూ క్షమాపణ!

Posted By:

పలు సాంకేతిక సమస్యల కారణంగా జనవరి 24, శుక్రవారం ఒక్కసారిగా జీమెయిల్ సేవలు ప్రపంచవ్యాప్తంగా స్తంబించాయి. జీమెయిల్ సర్వీసులు నిలిచిపోవటంతో గూగుల్ యూజర్లు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

 గూగుల్‌కు యాహూ క్షమాపణ!

ఆ సందర్భంలో జీమెయిల్ సేవలు నిలిచిపోవటాన్ని అవకాశంగా తీసుకున్న యాహూ జీమెయిల్ స్ర్కీన్ షాట్‌తో కూడిన ఓ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో యూహూ పోస్ట్ చేసిన ట్వీట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్ది సమయంలోనే ఆ ట్వీట్‌ను షుమారు 1500 మంది షేర్ చేసుకున్నారు.

కొద్ది సేపటి తరువాత తన ట్విట్టర్ అకౌంట్ నుంచి యాహూ ఆ వివాదాస్పద ట్వీట్‌ను తొలగించింది. ఈ చర్యకు గాను గూగుల్ ఇంకా జీమెయిల్ బృందానికి క్షమాపణ తెలిపింది. గతంలో యాహూ తన ఈ-మెయిల్ సర్వీస్‌‌లకు సంబంధించి పలు సందర్భాల్లో సాంకేతిక సమస్యలను ఎదుర్కొవల్సి వచ్చింది.

 గూగుల్‌కు యాహూ క్షమాపణ!

జీమెయిల్ సర్వీసులు అంతరాయానికి సంబంధించి గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ ‘సాంకేతిక లోపం కారణంగా తమ జీమెయిల్ సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని, వాటిని గుర్తించి వెంటనే తొలగించటం జరిగిందని మార్కెట్‌వాచ్‌కు వెల్లడించారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot