మూసివేత దిశగా యాహూ బిజినెస్‌లు !

Written By:

సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో తీవ్రమైన పోటీని ఎదుర్కుంటున్న యూహూ తన వ్యాపార కార్యకలాపాల్లో కొన్నింటిని మూసివేయాలని నిర్ణయించుకుంది. వ్యాపార పునర్ వ్యవస్థీకరణపై మరింతగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని డిజిటల్ మ్యాగజైన్స్‌ను నిలిపివేయడం మొదలుపెట్టింది.

Read more : ఇంటిదారి పట్టనున్న 17 వందల మంది యాహూ ఉద్యోగులు !

మూసివేత దిశగా యాహూ బిజినెస్‌లు  !

యాహూ ఫుడ్, హెల్త్, పేరెంటింగ్, మేకర్స్, ట్రావెల్, ఆటోస్, రియల్ ఎస్టేట్ మ్యాగజైన్లను దశలవారీగా మూసివేయనున్నట్లు సంస్థ గ్లోబల్ ఎడిటర్ ఇన్ చీఫ్ మార్తా నెల్సన్ తమ బ్లాగ్‌లో వెల్లడించారు. యాహూను వృద్ధి బాట పట్టించే దిశగా ఉత్పత్తులు, వనరులపరంగా మరింత సాహసోపేత ప్రణాళికను అమలు చేయాల్సి ఉంటుందని కంపెనీ సీఈవో మరిస్సా మెయర్ ఇటీవలే పేర్కొన్నారు.

మూసివేత దిశగా యాహూ బిజినెస్‌లు  !

దీని ప్రకారం దాదాపు 1,500 ఉద్యోగాల్లో కంపెనీ కోత విధించనుంది. దుబాయ్, మెక్సికో సిటీ, బ్యూనస్ ఎయిర్స్, మ్యాడ్రిడ్, మిలాన్ తదితర ప్రాంతాల్లో కార్యాలయాలను మూసివేయనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాహూ కంపెనీ కీలకమైన తన ఇంటర్నెట్ బిజినెస్‌ను

యాహూ కంపెనీ కీలకమైన తన ఇంటర్నెట్ బిజినెస్‌ను విక్రయించాలని యోచిస్తోంది. ఈవారం జరిగే కంపెనీ డెరైక్టర్ల బోర్డ్‌లో ఈ మేరకు ఒక నిర్ణయం వెలువడగలదని సమాచారం.

 

 

కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో భారీగా కోత

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం యాహు కంపెనీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో భారీగా కోత విధించనుంది.

 

 

సంస్థలో పనిచేసే 15 శాతం ఉద్యోగులు..

దాదాపు 1700 మందికి పైగా ఉద్యోగులను తొలగించే దిశగా అడుగులు వేస్తోందని యాహు చీఫ్ ఎగ్జిక్యూటీవ్ మరిస్సా మేయర్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

 

 

మేనేజ్ మెంట్ మార్పుల్లో భాగంగా

మేనేజ్ మెంట్ మార్పుల్లో భాగంగా డైరెకర్టపై ఒత్తిడి ఏర్పడినట్లు తెలుస్తోంది. యాహూ లాభాలు క్రమక్రమంగా తగ్గుతున్నందున సంస్థ నిర్వహణ ఖర్చును అదుపులో పెట్టేందుకు ఉద్యోగులను తీసేయడం మార్గంగా ఎంచుకుంది.

 

 

ఉద్యోగులను తొలగించడంతో పాటు

ఉద్యోగులను తొలగించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లోని తమ వ్యాపారా యూనిట్లను కూడా మూసివేయ నుందని సమాచారం.

 

 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు.

https://www.facebook.com/GizBotTelugu/

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Yahoo begins shuttering some digital services
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot