యాహూ నుంచి జాక్‌‍పాట్ కొట్టిన యువ ఇంటర్నెట్ తేజం!

Posted By:

యాహూ నుంచి జాక్‌‍పాట్ కొట్టిన యువ ఇంటర్నెట్ తేజం!
బ్రిటెన్‌కు చెందిన 17 సంవత్సరాల యువ ఇంటర్నెట్ పారిశ్రామికవేత్త నిక్ డి ఆలోయ్ సియో (Nick d'Aloisio) ఆన్‌లైన్ దిగ్గజం యాహూ నుంచి జాక్‌పాట్ అందుకున్నాడు. చిన్న స్ర్కీన్‌ల పై న్యూస్ స్టోరీలను సౌకర్యవంతంగా చుదువుకునేందుకు వీలుగా ఈ యువతేజం రూపొందించిన అప్లికేషన్ ‘సమ్లీ' (Summly)ని కొనుగోలు చేస్తున్నట్లు యాహూ సోమవారం ప్రకటించింది. ఈ అప్లికేషన్ కొనుగోలుకు సంబంధించి వెచ్చించే మొత్తాన్ని యాహూ వెల్లడించిలేదు.

గత ఐదు నెలల కాలంలో యాహూకిది ఐదవ సేకరణ. ఈ టీనేజర్ రూపొందించిన సమ్లీ అప్లికేషన్ సాయంతో న్యూస్ స్టోరీలను స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీల స్ర్కీన్‌ల పై సౌకర్యవంతంగా స్ర్కోల్ చేస్తూ చదవుకోవచ్చు. ఈ డీల్ వ్యయం మిలయన్ డాలర్‌లలో ఉండవచ్చని బ్రిటీష్ పత్రికలు విశ్లేషిస్తున్నాయి. యువ ఇంజనీర్లను ప్రోత్సహించేందుకు యాహూ సీఈఓ మారిసా మేయర్ సిద్ధంగా ఉన్నట్లు ఈ తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot