యాహూ.. నా ఆనందానికి హద్దుల్లేవ్

Written By:

2015 సంవత్సరం టెక్ హీరోలకు బాగా కలిసివచ్చినట్లుంది. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా మాతృత్వపు ఆనందంలో మునిగితేలుతున్నారు. మొన్నటికీ మొన్న ఫేస్ బుక్ సీఈఓ ఈ ఆనందాన్ని కొట్టేస్తే ఇప్పుడు యాహూ సీఈఓ యాహూ అంటూ తెగ ఆనందపడిపోతోంది. ఎందుకంటే ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఆ ఆనందంలో భార్యభర్తలు ఇప్పుడు మునిగితేలుతున్నారు.

Read more: రూ. 3 లక్షల కోట్లు దానం చేసిన ఫేస్‌బుక్ సీఈఓ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆమె ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు

నిన్న ఫేస్బుస్ సీఈవో...తాజాగా యాహూ మహిళా సీఈవో మరిస్సా మేయర్ కూడా మాతృత్వపు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మరిస్సా ఈసారి డబుల్ ప్రమోషన్ కొట్టేశారు. ఆమె ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె టుంబర్ల్లో వెల్లడించారు.

మరిస్సా భర్త బోగ్ 'డూయింగ్ గ్రేట్' అంటూ ట్విట్

కుటుంబ సభ్యులతో పాటు, తనకు సహకరించినవారికి ధన్యవాదాలు అంటూ మరిస్సా ఈ సందర్భంగా ఆమె ట్విట్ చేశారు. మరోవైపు మరిస్సా భర్త బోగ్ 'డూయింగ్ గ్రేట్' అంటూ ట్విట్ చేయగా, కుటుంబమంతా థ్రిల్లింగ్ లో మునిగితేలుతోంది.

మేయర్ జూలై 2012 లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా

కాగా మరిస్సా మేయర్ జూలై 2012 లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా యాహూలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఫైనాన్షియర్ బోగ్ వివాహం చేసుకున్న ఆమె 2012లో తొలిసారి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

16 వారాలు ఉద్యోగానికి మెటర్నటీ లీవు పెట్టిన ఆమె

ఈ సందర్భంగా 16 వారాలు ఉద్యోగానికి మెటర్నటీ లీవు పెట్టిన ఆమె కేవలం నాలుగు వారాలకే ఉద్యోగానికి వెళ్లిపోయారు. అయితే ఈసారి కూడా మరిస్సా కేవలం రెండు వారాలు మాత్రమే మెటర్నిటీ సెలవు తీసుకున్నారు.

చైనీస్ కామర్స్ దిగ్గజం ఆలీబాబా కంపెనీ నుంచి యాహూ

కాగా చైనీస్ కామర్స్ దిగ్గజం ఆలీబాబా కంపెనీ నుంచి యాహూ తన పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

మరోవైపు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్

మరోవైపు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తన ముద్దుల కూతురు కోసం రెండు నెలల పెటర్నిటీ లీవ్ తీసుకున్న విషయం తెలిసిందే.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Yahoo CEO Marissa Mayer gives birth to identical twin girls - but will she still have a job to go back to after her two-weeks maternity leave?
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot