యాహూ యూజర్లు 800 మిలియన్లు: మరిస్సా మేయర్

Posted By:

యాహూ యూజర్లు 800 మిలియన్లు: మరిస్సా మేయర్

తమ ఇంటర్నెట్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్లు మంది యూజర్లు ఉన్న్టట్లు యాహూ సీఈఓ మరిస్సా మేయర్ అన్నారు. తాను యాహూ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కంపెనీ యూజర్ల సంఖ్య 20 శాతం మేర వృద్ధి చెందినట్లు ఆమె వెల్లడించారు. బుధవారం శాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసిన సాంకేతిక సదస్సులో పాల్గొన్న ఆమె ఈ వివరాలను పేర్కొన్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

యాహూ సీఈఓ మరిస్సా మేయర్ ఆమె భర్త జాక్ బోగ్యులు నూతనంగా $30 మిలియన్ డాలర్లను (ప్రస్తున్న ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.195.72కోట్లు) వెచ్చించి శాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని ఓ ట్యూడర్ తరహా భవనాన్ని కొనుగోలు చేసినట్లు వెబ్ప్రపంచంలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త వాస్తవమే అయితే ఓరాకిల్ లారీ ఎల్లీసన్, యాపిల్ జోనాథన్ ఈవ్, జింగా మార్క్పిన్కస్ లు మరిస్సా మేయర్ కు కొత్త పొరుగింటివారు అవుతారు. మరిస్సా మేయర్ దంపతులు ప్రస్తుతానికి తమ పాలోఆల్టోలోని నివాసంలో ఉంటున్నారు. ఈ దంపతులు కొనుగోలు చేసిన కొత్త ఇల్లుకు సంబంధించిన మార్కెటింగ్ ఫోటోలను తిలకించేందుకు క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot