యాహు, ఫేస్‌బుక్ మద్య మేధో సంపత్తి వివాదం

Posted By: Prashanth

యాహు, ఫేస్‌బుక్ మద్య మేధో సంపత్తి వివాదం

 

ఇంటర్నెట్ దిగ్గజ కంపెనీ యాహు తనయొక్క సాంకేతికత(టెక్నాలజీ)ని వినియోగించుకుంటున్నందుకుగాను ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్ బుక్‌కు అనుమితి సుంకం చెల్లించాలని కోరినట్లు సమాచారం. యాహు, ఫేస్‌బుక్ మద్య ఉన్న అనుబంధంతో ఫేస్‌బుక్ ఎంతో లభ్ది పొందిందని.. ముఖ్యంగా యాహు న్యూస్‌ని ఫేస్‌బుక్‌లో ఇంటిగ్రేడ్ చేయడం వల్ల ఫేస్‌బుక్‌ని ఉపయోగించే వినియోగదారుల సంఖ్య మరింతగా పెరిగింది.

ఈ విషయాన్ని స్వయంగా ఫేస్‌బుక్ డెవలపర్స్ బ్లాగ్ గత వారం తెలిపింది. ఆ బ్లాగ్ ప్రకారం యాహు న్యూస్‌ వెబ్ అప్లికేషన్‌ని ఫేస్‌బుక్‌లో నిక్షిప్తం చేయడం వల్ల ఫిబ్రవరి నెలలో ప్రతిరోజుకు ఫేస్‌బుక్‌ని దర్శించే సందర్శకులు 1.4 నుండి 1.6 మిలియన్లకు పెరిగారని తెలిపింది. దీంతో యాహు వాటాదారులకు జవాబుదారితనంగా మెలగాల్సి బాధ్యత మేరకే తమ పేటెంట్‌టెక్నాలజీని వాడుకుంటున్నందుకు సుంకాలను చెల్లించకుండా ఫేస్‌బుక్‌ ఉన్నట్లయితే తాము ఏకపక్షంగా నడుచుకోక తప్పదని యాహుతెలిపింది.

ఇంకా ప్రైవసీ కంట్రోల్‌కు అనుసరించే విధానం సమాచార సేకరణ, సందేశ వాహిని సేవలకు తన అనమతి లేకండానే టెక్నాలజీని వాడుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌పై యాహూ అభియోగం మోపింది. ఇరు పక్షాల ప్రతినిధులు సమావేశమై యాహూ పేటెంట్లు కలిగిన 10 నుంచి 20 అంశాలపై సవివరంగా చర్చలు జరిపాయి. ఈచర్చల్లో అనుమతులు పొందడానికి యాహూ డిమాండ్‌ ఏమేరకు ఉంటుందనేది చర్చ జరిగినట్లు సమాచారం.

ఐతే ఫేస్‌బుక్‌తో జరిపిన చర్చలను వివరించేందుకు యాహూ విముఖత చూపింది. సుంకాలను డిమాండ్‌ చేస్తున్న మాట యదార్ధమేనని తెలిపింది. కొన్ని ఇతర సైట్లు ఇప్పటికే అనుమతులు పొందినట్లు గుర్తుచేసింది. దీనిని సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌ గుర్తించాలని యాహు విజ్ఞప్తి చేసింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot