యాహూ 'మూవీప్లెక్స్‌'తో ఆన్‌లైన్‌లోని సినిమాలు వీక్షించొచ్చు

Posted By: Super

యాహూ 'మూవీప్లెక్స్‌'తో ఆన్‌లైన్‌లోని సినిమాలు వీక్షించొచ్చు

ఇకపై సినిమా థియేటర్లు చిన్నబోనున్నాయి. అదేంటి అనుకుంటున్నారా.. అవునండీ.. ఇకపై సినిమాలను థియేటర్‌కు వెళ్లి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతర్జాల (ఇంటర్నెట్) దిగ్గజం యాహూ ఇండియా కొత్తగా ఆన్‌లైన్‌లోనే సినిమాలను అందిస్తోంది. ఈ సౌకర్యం కోసం 'మూవీప్లెక్స్" పేరిట మంగళవారం ప్రత్యేక సర్వీసును యాహూ ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా పైరసీ భూతానికి చెక్ పెట్టడమే కాకుండా, సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఉచితంగా ఆన్‌లైన్‌లోనే వీక్షించవచ్చు.

ప్రస్తుతం ప్రారంభంగా మూవీప్లెక్స్‌ సర్వీస్‌లో ఆక్రోష్, దిల్ తో బచ్చా హై జీ, రాక్‌ ఆన్, రణ్, లమ్హా, క్రూక్, రక్త చరిత్ర, రక్త చరిత్ర2 చిత్రాలను యాహూ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సర్వీస్‌లో భాగంగా మరిన్ని సినిమాలను అందించేందుకు గానూ వివిధ సినీ నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు యాహూ పేర్కొంది. నాణ్యమైన, పైరసీ బెడద లేని కంటెంట్‌కు యూజర్ల నుంచి ఆదరణ పెరుగుతోన్న నేపథ్యంలో ఈ సర్వీసును ప్రవేశపెట్టినట్లు యాహూ ఇండియా ఎండీ అరుణ్ తాడంకి అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot