'యూట్యూబ్' కి పోటీగా ఉచితంగా యాహూ వీడియో సర్వీస్

Posted By: Staff

'యూట్యూబ్' కి పోటీగా ఉచితంగా యాహూ వీడియో సర్వీస్

న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజన్ గెయింట్ యాహు ఇండియా 'యాహూ వీడియో' పేరుతో ఉచితంగా ఆన్‌లైన్ వీడియో సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు మంగళవారం ప్రకటించింది. టీవీ చానళ్లు, సినిమా నిర్మాణ సంస్థల భాగస్వామ్యంలో యాహూ కంపెనీ కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. యాహు వీడియో ద్వారా 35 కంటెంట్ ప్రొడ్యూసర్స్‌కి చెందిన న్యూస్, ఎంటర్టెన్మెంట్, లైఫ్ స్టయిల్ సినిమాలను వీక్షించవచ్చు. ఈ 35 కంటెంట్ ప్రొడ్యూసర్స్‌లో ఎన్‌డిటివి, స్టార్ టివి, హెడ్ లైన్స్ టుడే, పివిఆర్ పిక్చర్స్ లాంటి సంస్దలు ప్రముఖ పాత్రను పోషించనున్నాయి.

అడ్వర్టైజర్లకు కొత్త ఆదాయ వనరుగా ఇది ఉపయోగపడుతుందని కంపెనీ వెల్లడించింది. పైరసీ లేని అత్యంత నాణ్యమైన ఒరిజినల్ కంటెంట్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆన్‌లైన్‌లో చూడొచ్చని యాహూ ఇండియా ఎండీ అరుణ్ తాడంకి ఓ ప్రకటనలో చెప్పారు. వార్తలు, వినోదం, లైఫ్‌స్టైల్, సినిమాలు ఇలా అనేక రకాలైన కంటెంట్‌ను ఉచితంగా అందివ్వనున్నారు. ప్రతినెలా దాదాపు 3 కోట్ల మంది భారతీయులు ఆన్‌లైన్ వీడియోలను వీక్షిస్తున్నారని సర్వేలో తేలింది.

అంతేకాకుండా యాహు వీడియోని ప్రవేశపెట్టడం వల్ల గూగుల్ యూట్యూబ్‌కి కాంపిటేటర్‌గా కూడా మార్కెట్లో నిలవొచ్చని అన్నారు. త్వరలో యాహు వీడియోలో 'మూవీ ప్లెక్స్'ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. దీని ద్వారా యూజర్స్ పూర్తి నిడివి కలిగిన సినిమాలను తక్కువ ధరకే వీక్షించవచ్చు. యాహు వీడియో ప్రవేశపెట్టిన వీడియోలను మొత్తం ఏడు భాషల(హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, తెలుగు)లో విడుదల చేయనున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot