యాహూ నుంచి కొత్త సెర్చ్ ఇంజన్ 'సెర్చ్ డైరెక్ట్'

By Super
|
యాహూ నుంచి కొత్త సెర్చ్ ఇంజన్ 'సెర్చ్ డైరెక్ట్'
ప్రముఖ ఇంటర్నెట్ కంపెనీ యాహూ ఈ ఏడాది ద్వితీయార్థంలో ఓ సరికొత్త సెర్చ్ ఇంజన్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. నంబర్ వన్ సెర్చ్ ఇంజన్ గూగుల్‌ నుంచి వస్తున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కొనేలా డిజిటల్‌ మీడియా కంపెనీ యాహూ 'సెర్చ్‌ డైరెక్ట్‌' పేరిట సరికొత్త సేవలను ఈ ఏడాది జూన్ నుంచి అందుబాటులోకి రానున్నాయి. నస్దక్-లిస్టెడ్ డిజిటలి మీడియా కంపెనీ ఇప్పటికే గత వారంలో సెర్చ్‌ డైరెక్ట్‌ బీటా వెర్షన్‌ను అమెరికాలో విడుదల చేసినట్లు యాహూ చీఫ్‌ సైంటిస్ట్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్ హెడ్ (యాహూ ల్యాబ్స్) ప్రభాకర్‌ రాఘవన్‌ వెల్లడించారు.

తమ సెర్చ్ ఇంజన్‌లో ఓ వ్యక్తి టైప్ చేసే స్పీడ్‌కు సమానంగా.. అంతే స్పీడ్‌తో ఫలితాలు డిస్‌ప్లే అవుతాయని, మరిన్ని లింక్‌లను వెతుకుతూ ఉండాల్సిన అవసరం తప్పిస్తుందని ఆయన చెప్పారు. ఈ సదుపాయం కోసం మైక్రోసాఫ్ట్‌తో అలయన్స్ పెట్టుకున్నామని రాఘవన్ వివరించారు. భారత్‌లో ఇంటర్నెట్‌ను వాడుతున్న వారిలో 74 శాతం మంది యాహూతో ఏదో ఒక విధమైన సంబంధాలు కొనసాగిస్తున్నారని, ప్రపంచ వ్యాప్తంగా 14 వేల మంది యాహూ సంస్థల్లో పనిచేస్తుండగా, బెంగళూరులోని ఆర్‌ & డి సెంటర్‌లో రెండు వేల మందికి పైగా ఉపాధిని పొందుతున్నారని ఆయన తెలిపారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X