Home
News

2023లో రూ.30 వేల రేంజ్‌లో విడుదలైన బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లు.. లిస్ట్‌?

మిడ్‌ రేంజ్ స్మార్ట్‌ ఫోన్‌ కేటగిరిలో 2023 సంవత్సరంలో అనేక రకాల స్మార్ట్‌ఫోన్లు విడుదల అయ్యాయి. రూ. 30 వేల రేంజ్‌లో అనేక సంస్థలకు చెందిన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అనేక విభాగాల్లో కొన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు ప్రత్యేకతను కనబరిచాయి.

మోటోరోలా ఎడ్జ్‌ 40 : 6.55 అంగుళాల POLED స్క్రీన్‌తో వస్తుంది. 1200 నిట్స్‌ వరకు బ్రైట్‌నెస్‌, 3D కర్వడ్‌ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌,360 టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో వస్తాయి. పొరపాటున ఫోన్ కిందపడిన ఫోన్ డ్యామేజీ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతోపాటు ఈ ఫోన్‌ HDR10+, 92.7 శాతం స్క్రీన్‌ టూ బాడీ రేషియోను కలిగి ఉంటుంది.

poco f5

పోకో F5 : పోకో F5 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7+ జెన్‌ 2 ప్రాసెసర్‌పైన పనిచేస్తుంది. మరియు ఈ సెగ్మెంట్‌లో మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ లిక్విడ్‌ కూల్‌ టెక్నాలజీ 2.0ను సపోర్టు చేస్తుంది. మరియు మెరుగైన పనితీరు కోసం LPDDR5 RAM తోపాటు UFS 3.1 స్టోరేజీతో జతచేయబడుతుంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 : ఈ స్మార్ట్‌ఫోన్‌ మెరుగైన సాఫ్ట్‌వేర్‌, ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ వన్‌ప్లస్‌ ఫోన్‌ ఆక్సిజన్‌ OS 13.1 పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 3, 4 సంవత్సరాల పాటు ఓఎస్‌ అప్‌డేట్లతోపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తుంది. మరియు కొత్త ఫీచర్లను అందిస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ F54 : ఈ స్మార్ట్‌ఫోన్‌ 25W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఫలితంగా ఉత్తమ బ్యాటరీ పనితీరును కనబరిచే స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. సింగిల్‌ ఛార్జింగ్‌తో సుమారు రెండు రోజుల బ్యాటరీ లైఫ్‌ వస్తుందని సంస్థ చెబుతోంది. మెరుగైన కెమెరా, సాఫ్ట్‌వేర్‌, సూపర్ అమోలెడ్‌ 120Hz స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 30 వేలలోపు మెరుగైన ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకొనే వారికి ఈ ఫోన్‌ ఉత్తమ ఎంపిక అయ్యే అవకాశం ఉంది.

poco f5

Oppo Reno 10 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌ మెరుగైన వెనుక కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ 30 వేల రూపాయల ధరకే 32MP సోనీ IMX709 టెలీఫోటో సెన్సార్‌ మరియు ప్రో పాట్రాయిడ్‌ మోడ్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 64MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైట్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరాల ద్వారా 4k 30fps వరకు షూట్‌ చేయవచ్చు. నాణ్యమైన ఫోటోగ్రఫీ కోసం ఎదురుచూసే వారికి ఈ ఫోన్‌ ఉత్తమ ఎంపిక అయ్యే అవకాశం ఉంది.

ఇన్ఫినిక్స్‌ జీరో 30 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌ మెరుగైన సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా ద్వారా 4k నాణ్యతతో 60FPS వీడియోలను రికార్డు చేయవచ్చు. మరియు ఈ ఫోన్‌ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మెరుగైన సెల్ఫీ కెమెరా కోసం ఎదురుచూస్తున్నవారు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మీ నోట్‌ 12 ప్రో ప్లస్‌ 5G : రూ.30 వేలలోపు ధరలో ఈ ఫోన్‌ మెరుగైన ఎంపిక అయ్యే అవకాశం ఉంది. 6.67 అంగుళాల అమోలెడ్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. మీడియాటెక్‌ 1080 CPUను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత MIUI 13 OSను కలిగి ఉంటుంది. 120W ఛార్జింగ్‌ సపోర్టుతో 4980mAH బ్యాటరీ, 200MP + 8MP + 2MP వెనుక కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు 16MP ఫ్రంట్‌ కెమెరాను కలిగి ఉంటుంది.

IQOO Neo 7 : ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల AMOLED స్క్రీన్‌తో వస్తుంది. 1200Hz ఇన్‌స్టంట్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో వస్తుంది. మరియు డైమెన్సిటీ 8200 చిప్‌ పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత పన్‌టచ్‌ OS 13తో వస్తుంది. 120W ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 64MP OIS ప్రైమరీ మరియు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Year ender 2023 best smartphones launched under rs30000 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X