2023లో గూగుల్‌లో ఎక్కువ మంది దేనికోసం వెతికారంటే?
Google అందుబాటులోకి వచ్చాక మనకు కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాం. మరికొన్ని రోజుల్లో 2023 సంవత్సరం ముగిసిపోనుంది. అయితే చాలా మంది ఈ ఏడాది జరిగిన హైలెట్ల గురించి తెలుసుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గూగుల్ సంస్థ ఈ ట్రెండింగ్ (year in search 2023) నివేదికను వెల్లడించింది. ఇందులో అనేక ట్రెండింగ్ టాపిక్‌లు సహా వీడియోలు కూడా ఉన్నాయి.
గూగుల్‌లో దేనికోసం వెతికారంటే.. ? : చంద్రయాన్-3 ప్రయోగం నుంచి కర్ణాటక ఎన్నికలు మరియు G20 సమ్మిట్ సహా అనేక పొలిటికల్ కార్యక్రమాలు ఈ జాబితాలో ఉన్నాయి. దీంతోపాటు ప్రధానంగా ప్రపంచ కప్‌కు సంబంధించి అప్‌డేట్ల కోసం వెతికేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారు. అయితే ఈ ఏడాదిలో గూగుల్‌లో ఎక్కువ మంది దేనికోసం వెతికారనే సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ అంశాలకు సంబంధించి 12 జాబితాలను గూగుల్ ఇటీవల షేర్ చేసింది.

ప్రతి సంవత్సరం చివరలో.. ఏడాదిలో ఎక్కువ మంది శోధించిన వివరాలను గూగుల్ (Google search 2023) అందిస్తుంది. 2023 సంవత్సరానికి సంబంధించిన వివరాలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. అందులో ఎక్కువ మంది యూజర్లు వెతికిన ప్రాంతాలు, వ్యక్తులు, వివిధ సంస్థల, రోజుల ప్రత్యేకతలు వంటివి ఉన్నాయి. 2023 సంవత్సరంలో ఎక్కువ మంది యూజర్లు చంద్రయాన్ గురించి తెలుసుకొనేందుకు గూగుల్‌ను ఆశ్రయించారు.
2023లో గూగుల్‌లో టాప్ - 5 కార్యక్రమాలు
1 . చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించిన వివరాలు
2 . కర్ణాటక ఎన్నికల ఫలితాలు
3 . ఇజ్రాయెల్ దేశానికి వార్తలు
4 . సతీష్ కౌశిక్
5 . కేంద్ర బడ్జెట్ 2023
దీంతోపాటు మరిన్ని అంశాలపై ఎక్కువ మంది శోధించారు.
1 . G20 అంటే ఏమిటి ?
2 . UCC అంటే ఏమిటి ?
3 . ChatGPT అంటే ఏమిటి ?
4 . హమాస్ అంటే ఏమిటి?
5 . 2023 సెప్టెంబర్ 28 గురించి
దీంతోపాటు ఇతర ఆసక్తికర అంశాలపై ఎక్కువ మంది తెలుసుకొనే ప్రయత్నం చేశారు.
1 . ఇంట్లో ఉత్పత్తుల ద్వారా చర్మం, జుట్టు డ్యామేజీ కాకుండా ఎలా నివారించాలి.
2 . యూట్యూబ్‌లో తొలి 5K ఫాలోయర్స్‌ను ఎలా పొందాలి.
3 . కబడ్డిలో రాణించడం ఎలా?
4 . కారు అధిక మైలేజీని ఎలా పొందాలి?
5 . చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా ఎలా మారాలి?
2023లో స్పోర్ట్స్ రంగంలో టాప్ - 5 శోధనలు
1 . ఇండియన్ ప్రీమియర్ లీగ్
2 . క్రెకెట్ ప్రపంచ్ కప్
3 . ఆసియా కప్
4 . మహిళల ప్రీమియర్ లీగ్
5 . ఆసియా క్రీడలు
నియర్ అండ్ డియర్ : 2023లో టాప్ 5 శోధనలు
1 . నా దగ్గర కోడింగ్ క్లాసులు
2 . సమీపంలో భూకంపం
3 . జైలర్ సినిమా
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








