కట్నం నిమిత్తం 10 లక్షల ఫేస్‌బుక్ లైక్స్ అడిగిన మామ!

Posted By:

సంప్రదాయబద్ధమైన సమాజాలలో యెమెన్ ఒకటి. ఈ ప్రాంతంలో తాజాగా చోటు చేసుకున్న ఓ వివాహ ఒప్పందం మోడ్రన్ ట్విస్ట్‌కు తెరలేపింది. తన కూతురిని వివాహమాడాలంటే కట్నం నిమిత్తం 10 లక్షల ఫేస్‌బుక్ లైక్‌లను చెల్లించాలంటూ ఓ మామ కాబోయే అల్లుడికి  షరతు విధించాడు. మామగారి లక్ష్యాన్ని సవాల్‌గా స్వీకరించిన ఆ అల్లుడు కట్నం చెల్లించే పనిలో నిమగ్నమయ్యాడు.

నా కూతురు కావాలా..? 10 లక్షలిచ్చుకో!!

యెమెన్ దేశంలోని టైయిస్ నగరానికి చెందిన రచయిత సలేం అయష్ తనకు కాబోయే అల్లుడైన ఒసామాను కట్నం కింద 10లక్షల ఫేస్‌బుక్ లైక్‌లను అడిగినట్లు ప్రముఖ అంతర్జాతీయ న్యూస్ పోర్టల్ ఓ కథనాన్ని ప్రచురించింది.

అయితే యోమెన్ దేశ జనభా 25 మిలియన్‌లు మాత్రమే. వీరిలో ఎంతమంది ఫేస్‌బుక్ అకౌంట్‌‌లను కలిగి ఉన్నారన్నది ఓ సవాల్ అయితే. ఎంతమంది ఈ పెళ్లిని సపోర్ట్ చేస్తారన్నది మరో ప్రశ్నగా నిలిచింది.

మామగారు విధించిన లక్ష్యాన్ని అందుకుని ఆయన కుమార్తెను మనువాడే లక్ష్యంతో ఒసామా మామాగారైన సలేం అయష్ పేరుమీద ఓ ప్రత్యేకమైన ఫేస్‌బుక్ పేజీని క్రియేట్ చేసాడు. ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ పేజీకి ఇప్పటి వరకు 35 వేలు లైక్స్ లభించాయి. ఏదేమైనప్పటికి ఈ సంఘటన వివాహ వ్యవస్థల్లో కొత్త సంస్కృతికి తార్కాణంగా నిలించిందని పలువురు నెటిజనులు విశ్లేషిస్తున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting