రూ. 5200కే అదిరిపోయే వైఐ స్మార్ట్ డాష్ కెమెరా
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ షియోమికి చెందిన వైఐ టెక్నాలజీస్ తాజాగా కొత్త ప్రొడక్టును దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. దీని పేరు వైఐ డాష్ కెమెరా. ఇదొక మానిటరింగ్ సిస్టమ్‌లాగా పనిచేస్తుంది. మానిటరింగ్ సిస్టమ్‌లాగా పనిచేయడం దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ఈ కెమెరాను కారుకు కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు కారు డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే ప్రతీదీ కెమెరాలో రికార్డ్ అవుతుందని సంస్థ తెలిపింది. ఈ కెమెరా ధరను కంపెనీ రూ.5,200గా నిర్ణయించింది. ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా కంపెనీ దీన్ని రూ.699 తక్కువకు ఇప్పుడు ఇస్తోంది.

ఫీచర్లు చూస్తే..
రికార్డు చేసుకోవచ్చు
ఈ కెమెరాతో 165 డిగ్రీల్లో హైడెఫినేషన్ వీడియోలను రికార్డు చేసుకోవచ్చు
ఇందులో మెమరీ కార్డు పెట్టుకోవచ్చు
అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్
వైఐ స్మార్ట్ డాష్ కెమెరాలో 2.7 అంగుళాల స్క్రీన్ ఉంటుంది
జ సెన్సర్ మొదలగు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

డైలీ ఈవెంట్స్ రికార్డు
వైఐ స్మార్ట్ డాష్ కెమెరాను కారు అద్దానికి అతికించుకోవచ్చు. దీంతో డైలీ ఈవెంట్స్‌ను రికార్డు చేసుకోవచ్చు. కెమెరాతో 165 డిగ్రీల్లో హైడెఫినేషన్ వీడియోలను రికార్డు చేసుకోవచ్చు. ఇందులో మెమరీ కార్డు పెట్టుకోవచ్చు. దీంతో రికార్డు అయ్యే వీడియోలను డైరెక్ట్‌గానే కార్డులో స్టోర్ అవుతాయి. వైఫై సహాయంతో డ్యాష్ కెమెరా నుంచి లైవ్ వీడియోను ప్రసారం చేసుకోవచ్చు.

అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్
స్మార్ట్ డాష్ కెమెరాలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది డ్రైవర్లకు రియల్ టైమ్‌లోనే హెచ్చరిస్తూ ఉంటుంది. రోడ్డు లైన్ క్రాస్ అయితే వెంటనే వార్నింగ్ ఇస్తుంది. అలాగే ముందు జరగబోయే ప్రమాదాన్ని కూడా హెచ్చరిస్తుంది. కారు వేగాన్ని తగ్గించకపోతే ఎంతటి ప్రమాదం జరుగుతుందో తెలియజేస్తుంది.

2.7 అంగుళాల స్క్రీన్
వైఐ స్మార్ట్ డాష్ కెమెరాలో 2.7 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. దీనిపై రికార్డ్ అయిన వీడియోను చూడొచ్చు. వైఫై సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో జీ సెన్సర్ కూడా ఉంటుంది. ఎమర్జెన్సీ సమయాల్లో ఆటోమేటిక్‌గానే ఫోటోలు రికార్డు చేస్తుంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ కెమెరాను కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








