Home
News

You Broadband ప్లాన్‌ల ధరలు తగ్గాయి!!వీటి మీద ఓ లుక్ వేయండి...

ఇండియాలోని బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో తన యొక్క యూజర్ బేస్ ను పెంచుకోవడానికి దేశవ్యాప్తంగా యూ బ్రాడ్‌బ్యాండ్ తన యొక్క ప్లాన్ లలో సవరణలను చేసింది. జనవరి 2021 చివరిలో పూణే మరియు సూరత్ నగరాల్లో యు బ్రాడ్‌బ్యాండ్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ మరియు ముంబైతో సహా అనేక ఇతర నగరాల్లో ISP తో కూడిన తన సమర్పణలను అప్ డేట్ చేసింది. యు బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు ముంబైలో 200 Mbps, 150 Mbps , 100 Mbps వేగంతో లభించే మూడు 'డ్యూయల్ స్పీడ్ ప్లాన్‌లను కలిగి ఉంది. డ్యూయల్ స్పీడ్ (FUP) ప్లాన్‌లు పేరును సూచించినట్లుగా ఎఫ్‌యుపి పరిమితిని కలిగి ఉంటాయి. అంతేకాకుండా ISP 60 Mbps వేగంతో లభించే 'అన్‌లిమిటెడ్ డేటా' మరియు 'డేటా ప్లాన్‌లు' కూడా కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

యు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల తగ్గింపు ధరల వివరాలు

యు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల తగ్గింపు ధరల వివరాలు

ప్రస్తుతం చాలా మంది వినియోగదారులు అపరిమిత FUP పరిమితితో హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ఎంచుకుంటూ ఉంటారు. యు బ్రాడ్‌బ్యాండ్ యొక్క డ్యూయల్ స్పీడ్ (FUP) ప్లాన్‌లు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నాయి. 200Mbps డ్యూయల్ స్పీడ్ (FUP) ప్లాన్‌ 30 రోజుల చెల్లుబాటుకు రూ.1,618 ధర వద్ద లభిస్తుంది. ఇది 500GB డేటాను అందిస్తుంది. అలాగే 90 రోజుల చెల్లుబాటు కాలానికి 1575GB డేటాతో లభించే ప్లాన్ యొక్క ధర రూ.4,839. అలాగే 180 రోజుల చెల్లుబాటు కాలానికి 3300GB ఎఫ్‌యుపి పరిమితితో లభించే ప్లాన్ యొక్క ధర రూ.9,658. చివరగా 360 రోజుల చెల్లుబాటు కాలంతో 200Mbps వేగంతో లభించే ప్లాన్‌కు రూ.19,266 ఖర్చవుతుంది. ఇది మొత్తం చెల్లుబాటులో 6900GB ని అందిస్తుంది. అంటే నెలకు 575GB డేటాను అందిస్తుంది. FUP వేగం తర్వాత ఈ ప్లాన్ 5 Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది.

150 Mbps స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

150 Mbps స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 30 రోజులు, 90 రోజులు, 180 రోజులు, 360 రోజుల చందాలలో లభిస్తుంది. ధరల మార్పులు పొందిన తరువాత వీటి యొక్క ధరలు వరుసగా రూ.1,382, రూ.4,131, రూ.8,242 మరియు రూ.16,434. ఈ ప్లాన్ FUP పరిమితితో వరుసగా 400GB, 1275GB, 2700GB మరియు 5700GB డేటా ప్రయోజనాన్ని అందిస్తాయి. చివరగా యు బ్రాడ్‌బ్యాండ్ యొక్క 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రతి నెలా 350GB డేటా ప్రయోజనంతో రూ.1,326 ప్రారంభ ధర వద్ద నుండి లభిస్తుంది.

యు బ్రాడ్‌బ్యాండ్ అపరిమిత డేటా ప్లాన్‌

యు బ్రాడ్‌బ్యాండ్ అపరిమిత డేటా ప్రయోజనంతో కూడా ప్లాన్‌లను అందిస్తోంది. అయితే వాటి ధర కొద్దిగా అధికంగా ఉంటుంది. ఉదాహరణకు 60Mbps వేగంతో లభించే అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్ 30 రోజుల చెల్లుబాటు కాలానికి రూ.1,387 ధర వద్ద, 97 రోజుల వాలిడిటీకి రూ.4,148 ధర వద్ద, 195 రోజుల చెల్లుబాటుతో లభించే ప్లాన్ రూ.8,277 ధరను, అలాగే 390 రోజుల చెల్లుబాటు కాలానికి లభించే ప్లాన్ యొక్క ధర రూ.16,503 వద్ద కలిగి ఉంటుంది. అపరిమిత డేటా ప్లాన్‌లు 40 Mbps, 24 Mbps మరియు 16 Mbps వేగంతో వస్తాయి.

యు బ్రాడ్‌బ్యాండ్ VS జియోఫైబర్ VS ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్

యు బ్రాడ్‌బ్యాండ్ VS జియోఫైబర్ VS ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్

బ్రాడ్‌బ్యాండ్ రంగంలో లభించే ఇతర సంస్థల డేటా ప్లాన్ లతో పోలిస్తే యు బ్రాడ్‌బ్యాండ్ నుండి లభించే ప్లాన్ లు అంత పోటీగా లేవు. జియోఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ సంస్థలు అపరిమిత డేటా బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలను మరింత తక్కువ ధరలకు అందిస్తున్నాయి. ఉదాహరణకు ఇవి ప్రస్తుతం 300 Mbps ప్లాన్‌ను 3.3TB FUP పరిమితితో రూ .1,499 నెలవారీ ధర వద్ద కలిగి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
You Broadband Internet Plans Price Slashed in All Cities
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X