నెలకి 1000జిబి డేటా,35 పైసలకే 1జిబి డేటా, జియోకి అసలైన సవాల్

|

టెలికాం రంగంలో పోటీ అనివార్యమైన నేపథ్యంలో దిగ్గజాలన్నీ నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి.అయితే ఈ పోటీ టెలికా రంగానికే కాకుండా బ్రాడ్‌బ్యాండ్ రంగానికి కూడా పాకింది. జియో బ్రాడ్‌బ్యాండ్ భారీ ఆఫర్లతో దూసుకువస్తోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో వొడాఫోన్ ఆధీనంలో ఉన్న YOU Broadband ఈ రంగంలో ఓ కొత్త బెంచ్ మార్క్ ని సృష్టించింది. లేటెస్ట్ గా దిమ్మతిరిగే ప్లాన్ ని YOU Broadband యూజర్ల కోసం ఆవిష్కరించింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లకు సంవత్సరానికి 12టిబి డేటా అందనుంది. ఈ ప్లాన్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో సరికొత్త సవాల్ విసరనుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. పూర్తి వివరాల్లోకెళితే..

 

ఐడియా 30 జిబి డేటా ఉచితం, ఎలా పొందాలో తెలుసుకోండిఐడియా 30 జిబి డేటా ఉచితం, ఎలా పొందాలో తెలుసుకోండి

రూ. 353తో

రూ. 353తో

రూ. 353తో యూజర్లు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా సంవత్సరానికి 12 TB డేటాను పొందుతారు. నెలకి 1000 జిబి డేటాను ఈ ప్లాన్ లో భాగంగా అందిస్తోంది.

1జిబి డేటా కాస్ట్ 35 పైసలు మాత్రమే

1జిబి డేటా కాస్ట్ 35 పైసలు మాత్రమే

దీన్ని రూపాయిల్లో కాలిక్యులేట్ చేస్తే 1జిబి డేటా కాస్ట్ 35 పైసలు మాత్రమే అవుతుంది. ఈ ప్లాన్ అందుకునే యూజర్లను 78 Mbpsతో డేటా స్పీడ్ ని అందుకుంటారు.

హైదరాబాద్ ఏరియాల్లో

హైదరాబాద్ ఏరియాల్లో

కాగా కంపెనీ ఇప్పటికే హైదరాబాద్ ఏరియాల్లో మూడు నెలలు, ఆరు నెలల ప్లాన్లను కూడా అందిస్తోంది.అక్కడ 200 Mbps, 150 Mbps ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

 JioFiberకి గట్టి పోటి
 

JioFiberకి గట్టి పోటి

ఈ ప్లాన్ త్వరలో రానున్న JioFiberకి గట్టి పోటి నిచ్చే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా జియో 1.1. TB free with 100 Mbps speedతో కొత్త ప్లాన్ లాంచ్ చేయనుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ ఏడాది లాంచ్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే ఎయిర్‌టెల్ కూడా

ఇప్పటికే ఎయిర్‌టెల్ కూడా

ఇప్పటికే ఎయిర్‌టెల్ కూడా 100 Mbps speedతో 100 Mbps speed ఆఫర్లను అందిస్తోంది. ఇండియా వ్యాప్తంగా 40 lakh new connectionsని సాధించే లక్ష్యంతో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో శరవేగంగా అడుగులు వేస్తోంది.

YOU Broadband సరికొత్త ప్లాన్ రాకతో..

YOU Broadband సరికొత్త ప్లాన్ రాకతో..

ఇప్పుడు YOU Broadband సరికొత్త ప్లాన్ రాకతో పోటీ నువ్వే నేనా అన్నట్లుగా తయారయింది. ఇక వీటితో పాటు జియో పైబర్ కూడా కలిస్తే వార్ మరింతగా వేడెక్కే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Best Mobiles in India

English summary
Vodafone’s YOU Broadband Launches 12 TB Annual Plan; Get 1 GB For Just 35 Paise! More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X