హైదరాబాద్ లో తక్కువ ఖర్చుతో హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్
హైదరాబాద్ లో ఉన్న వారికి ఇంటర్నెట్ ఉపయోగించడానికి తక్కువ ఖర్చులో అధిక వేగంతో అందిచడానికి ప్రముఖ బ్రాడ్‌బ్యాండ్ సంస్థ వోడాఫోన్ సొంత యాజమాన్యంలోని యు బ్రాడ్‌బ్యాండ్ 100 ఎమ్‌బిపిఎస్ స్పీడ్ తో అపరిమిత డేటా ప్లాన్‌లను అందిస్తోంది. సర్వీస్ ప్రొవైడర్ వినియోగదారులకు నాలుగు 100 ఎమ్‌బిపిఎస్ ప్లాన్‌లను ఇస్తోంది.మొదటి ప్లాన్ 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో 30 రోజుల వాలిడిటీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రారంభ ధర కేవలం 944 రూపాయలు మాత్రమే.

ఈ ప్లాన్‌తో అపరిమిత డేటాను పొందవచ్చు. 30 రోజుల ప్రణాళికతో పాటు YOU బ్రాడ్‌బ్యాండ్ కంపెనీ 90 రోజులు, 180 రోజులు మరియు 360 రోజుల వాలిడిటీతో మరొక మూడు అపరిమిత డేటా ప్లాన్‌లను కూడా అందిస్తోంది.

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ధరలు:
90 రోజుల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర 2,744 రూపాయలు, 180 రోజుల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ మొత్తం కాలానికి 5,133 రూపాయలు. అంతేకాకుండా 360 రోజుల వాలిడిటీ ప్యాకేజీ మొత్తం సంవత్సరానికి 9,558రూపాయలకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.ముఖ్యంగా ఈ 100 ఎమ్‌బిపిఎస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

150 ఎమ్‌బిపిఎస్ స్పీడ్ ధరలు:
YOU బ్రాడ్‌బ్యాండ్ సంస్థ150 ఎమ్‌బిపిఎస్ మరియు 200 ఎమ్‌బిపిఎస్ స్పీడ్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. 150 ఎమ్‌బిపిఎస్ ప్లాన్ 30-రోజులు, 90-రోజులు, 180-రోజులు మరియు 360-రోజులతో కలిపి మొత్తంగా నాలుగు ఎంపికలలో లభిస్తుంది. 30 రోజుల ప్లాన్ 1000 జీబీ ఇవ్వగా, 90 రోజుల ప్లాన్ 3,300 జీబీ ఇస్తుంది.అలాగే 180 రోజుల ప్లాన్ 7,200GB ఇవ్వగా, 360 రోజుల ప్లాన్‌తో 15,600GB వరకు డేటా లభిస్తుంది. ఈ ప్రణాళికలు 5 Mbps తరువాత FUP వేగాన్ని అందిస్తాయని నివేదించింది. ధరల విషయానికొస్తే YOU బ్రాడ్‌బ్యాండ్ 30 రోజులకు 1,403 రూపాయలు, 90 రోజులకు 4,209 రూపాయలు, 180 రోజులకు 8,418 రూపాయలు మరియు 360 రోజులకు 12,036 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది.

200 ఎమ్‌బిపిఎస్ స్పీడ్ ధరలు:
కంపెనీ తన వినియోగదారులకు అందించే అత్యధిక వేగం 200 Mbps. ఇక్కడ వోడాఫోన్ యాజమాన్యంలోని సంస్థ అదే నాలుగు చెల్లుబాటు ఎంపికలను ఇస్తోంది మరియు ధరలు వరుసగా 30 రోజులకు1,673రూపాయలు, 90 రోజులకు 5,019రూపాయలు, 180 రోజులకు 10,038రూపాయలు మరియు 360 రోజులకు 13,452రూపాయలుగా ఉంది. ఈ ప్రణాళికలు కూడా 5 Mbps వేగంతో వస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న యూజర్లు 15 ఎమ్‌బిపిఎస్, 30 ఎమ్‌బిపిఎస్, 50 ఎమ్‌బిపిఎస్, 75 ఎమ్‌బిపిఎస్ మరియు 100 ఎమ్‌బిపిఎస్‌లతో సహా ఇతర అపరిమిత డేటా ప్లాన్‌లకు కూడా సభ్యత్వాన్ని పొందే అవకాశం ఉంది.

లాంగ్ టర్మ్ ఆఫర్స్:
అంతేకాకుండా సర్వీస్ ప్రొవైడర్స్ తన ప్రస్తుత అద్భుతమైన ప్రణాళికలపై నాలుగు నెలల ఉచిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను పొందే అవకాశాన్ని అందిస్తున్నట్లు ఇటీవల నివేదించబడింది. YOU బ్రాడ్‌బ్యాండ్‌తో వారి సభ్యత్వాన్ని విస్తరించాలని చూస్తున్న వినియోగదారుల కోసం ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా చందాదారులు దీర్ఘకాలిక ఒక సంవత్సరం ప్రణాళికను ఎంచుకున్న వారికి మాత్రమే నాలుగు నెలల పాటు అదనపు సేవలను పొందటానికి అర్హులు. దీని అర్థం వినియోగదారులకు 12 నెలల ధర కోసం 16 నెలల బ్రాడ్‌బ్యాండ్ సేవలు లభిస్తాయి. అంతేకాకుండా ఇప్పటికే మూడు నెలలు మరియు ఒక నెల ప్రణాళిక ఉన్నవారు అర్ధ సంవత్సర ప్రణాళికను ఎంచుకోవచ్చు. ఇది చందాదారులకు రెండు నెలల అదనపు సేవను ఇస్తుంది.


Click it and Unblock the Notifications








