Just In
- 1 min ago
Flipkart Daily Triviaలో ఈ ప్రశ్నలకు సమాదానాలు ఇవ్వండి!! బహుమతులు గెలుచుకోండి...
- 1 hr ago
అమెజాన్ App లో రూ.25,000 ప్రైజ్ మనీ గెలుచుకోండి ! సమాధానాలు ఇవే !
- 15 hrs ago
Samsung Galaxy M31s ఫోన్ కొనుగోలు మీద రూ.1000 భారీ ధర తగ్గింపు...
- 17 hrs ago
మర్చిపోయిన BSNL ఫోన్ నంబర్‌ను సులభంగా కనుగొనడం ఎలా?
Don't Miss
- Movies
జబర్ధస్త్ సెట్లో ఊహించని ఘటన: టీమ్ లీడర్‌పై చేయి చేసుకున్న కమెడియన్.. షాక్‌లో నిర్వహకులు
- News
ఒళ్లు పగులుద్ది.. ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో.. ఏఈకి ఎమ్మెల్యే సోదరుడి బెదిరింపులు
- Lifestyle
మీ రాశిచక్రం ప్రకారం మీలో ఉన్న చెత్త చెడు ఏమిటో మీకు తెలుసా?
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Sports
India vs England: 'ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుంది.. మోడీ స్టేడియాన్ని నిషేధించాలి'
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
You Broadband యొక్క కొత్త 350Mbps ప్లాన్ ప్రయోజనాల మీద ఓ లుక్ వేయండి...
వోడాఫోన్ ఐడియా ఆధ్వర్యంలో రన్ అయ్యే యు బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు కొత్తగా 350Mbps స్పీడ్ తో వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తన వినియోగదారుల కోసం ఆఫర్ చేసింది. అయితే ప్రస్తుతం పూణే నగరంలో లభించే ఈ ప్లాన్ 350Mbps వేగంతో అపరిమిత డేటాను నెలకు రూ.2,065 ధర వద్ద అందిస్తుంది. యు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను బండిల్ చేసిన పోస్ట్‌పెయిడ్ మరియు వైర్డు బ్రాడ్‌బ్యాండ్ సేవలతో ప్రవేశపెట్టింది. 350Mbps బ్రాడ్‌బ్యాండ్ కొత్త ప్లాన్ 30 రోజులు, 95 రోజులు, 200 రోజులు మరియు 420 రోజుల చందా మోడల్లో వస్తుంది. ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇప్పటికే 300 Mbps, 250 Mbps, 200 Mbps, 125Mbps మరియు 100 Mbps వేగంతో ఇతర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందిస్తున్నది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

యు బ్రాడ్‌బ్యాండ్ 350Mbps ప్లాన్ ధరలు & ప్రయోజనాల వివరాలు
యు బ్రాడ్‌బ్యాండ్ యొక్క కొత్త 350Mbps ప్లాన్ ప్రస్తుతం నాలుగు వేర్వేరు చందాలలో లభిస్తుంది. 30 రోజుల చెల్లుబాటుతో లభించే ప్లాన్ యొక్క ధర రూ .2,065 కాగా, 95 రోజుల వాలిడిటీ ప్లాన్ ధర రూ.6,195 మరియు 200 రోజుల వాలిడిటీ ప్లాన్ ధర రూ.12,390. చివరిగా 420 రోజుల చెల్లుబాటుతో లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ సబ్స్క్రిప్షన్ ధర రూ.24,780. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది నెలకు 3.5TB చొప్పున అపరిమిత డేటాను అందిస్తుంది.

యు బ్రాడ్‌బ్యాండ్ 300Mbps ప్లాన్ ధరలు & ప్రయోజనాల వివరాలు
యు బ్రాడ్‌బ్యాండ్ సంస్థ 350Mbps స్పీడ్ తో అందించే ప్లాన్ కంటే తక్కువ వేగంతో లభించే 300 Mbps ప్లాన్ కూడా దాదాపు అదే ధర వద్ద లభిస్తుంది. 30 రోజుల వాలిడిటీకి 300 Mbps వేగంతో లభించే ప్లాన్ యొక్క ధర అన్ని రకాల పన్నులతో కలుపుకొని రూ.2,006 కాగా, 95 రోజుల వాలిడిటీకి లభించే ప్లాన్ యొక్క ధర 6,018 రూపాయలు. చివరిగా 200 రోజులు మరియు 420 రోజుల లాంగ్ వాలిడిటీ కాలానికి లభించే 300Mbps ప్లాన్ యొక్క ధరలు వరుసగా రూ.12,036 మరియు రూ.24,072 లుగా ఉన్నాయి. ఈ ప్లాన్ యొక్క డేటా ప్రయోజనాల విషయానికి వస్తే ఇది నెలకు 3.5TB చొప్పున అపరిమిత డేటాను అందిస్తుంది.

హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు: యు బ్రాడ్‌బ్యాండ్ vs జియో ఫైబర్ vs ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్
హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో ప్రస్తుతం ఈ కొత్త ప్లాన్లతో వొడాఫోన్ ఐడియా యొక్క యు బ్రాడ్‌బ్యాండ్ జియో ఫైబర్ మరియు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ల యొక్క హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లకు గట్టి పోటీని ఇస్తున్నది. జియో ఫైబర్ మరియు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ నుండి లభించే 300Mbps ప్లాన్ లు పన్నుల మినహాయిపుతో నెలకు రూ.1,499 ధర వద్ద లభిస్తుండగా. అదే సమయంలో యు బ్రాడ్‌బ్యాండ్ అదే ప్లాన్‌ను పన్నులతో కలుపుకొని రూ.2,000 ధర వద్ద అందిస్తున్నది. అయితే యు బ్రాడ్‌బ్యాండ్ దాని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లతో ఎటువంటి OTT సభ్యత్వాలను అందించడం లేదు. కస్టమర్లు డ్యూయల్-బ్యాండ్ రౌటర్‌ను తిరిగి పొందగలిగే రూ.1,999 డిపాజిట్ ధర వద్ద పొందవచ్చు. యు బ్రాడ్‌బ్యాండ్ యొక్క హై-స్పీడ్ ప్లాన్లతో రౌటర్ ఉచితంగా అందించబడుతుందని కంపెనీ తెలిపింది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190